ETV Bharat / city

గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

author img

By

Published : Dec 18, 2019, 5:04 AM IST

రాష్ట్రంలో పంటల దిగుబడి పెరుగుతున్నందున... మరిన్ని గోదాంలు నిర్మించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బోర్డు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి
గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరిన్ని గోదాముల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బోర్డు సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాగు నీటి ప్రాజెక్టుల రాకతో పంటల దిగుబడి పెరుగుతున్నందున... గోదాం నిర్మాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పంటలు గోదాంలలో నిల్వ చేసుకుంటే... మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వీలుంటుందన్నారు.

వెయ్యి కోట్ల నాబార్డు నిధులతో 336 ఆధునిక గోదాములు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా పథకం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో... సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో పంటల దిగుబడి మరింత పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారధి, టీఎస్ గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, కేంద్ర గిడ్డంగుల సంస్థ జీఎం ఆర్ఆర్ అగర్వాల్, ప్రాంతీయ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ముత్తురామన్ పాల్గొన్నారు.

గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

ఇదీ చూడండి: 'పౌరసత్వ చట్ట సవరణ అమలుపై వెనక్కి తగ్గేది లేదు'

17-12-2019 TG_HYD_60_17_MINISTER_ON_STORAGE_GODOWNS_AV_3038200 REPORTER : MALLIK.B Note : feed from desk whatsApp ( ) రాష్ట్రంలో భవిష్యత్ అవసరాల నేపథ్యంలో మరిన్ని గోదాముల నిర్మాణం తప్పనిసరి... అందుకోసం కేంద్రం సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బోర్డు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్ధసారధి, టీఎస్ గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, కేంద్ర గిడ్డంగుల సంస్థ జీఎం ఆర్ఆర్ అగర్వాల్, ప్రాంతీయ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ముత్తురామన్ తదితరులు పాల్గొన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల రాకతో పంటల దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మించిన గోదాంలు సద్వినియోగం అవుతున్నందున గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర గిడ్డంగుల సంస్థ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతుల పంటలన్నీ గోదాముల్లో నిలువకు ఉపయోగిస్తామని... మంచి ధర వచ్చినప్పుడు, వీలైనప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే... నాబార్డు నిధులు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి 336 ఆధునిక గోదాములు నిర్మించామని చెప్పారు. కీలక వ్యవసాయానికి ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా పథకం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భారీ ఎత్తున సాగు విస్తీర్ణం, పంటలు పెరిగిన దృష్ట్యా... రానున్న రోజుల్లో పంటల దిగుబడి మరింత పెరగనుందని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. VIS............

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.