Dragon Fruit: ఉద్యోగాన్ని వదిలేసి.. డ్రాగన్​ఫ్రూట్​ సాగులో విజయం సాధించి..

author img

By

Published : Jul 3, 2021, 8:03 PM IST

Srinivas Reddy is successful in cultivating dragon fruit in arutla
Srinivas Reddy is successful in cultivating dragon fruit in arutla ()

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆ పండును.. మన దగ్గర ఎందుకు పడించకూడదు అనుకున్నారు. ఎన్నో పరిశోధనలు... మెలకువలు తెలుసుకున్నారు. ఆ పంటను సాగుచేసేందుకు .. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. పూర్తిస్థాయి రైతు అయ్యారు. ఇప్పుడు.. విజయవంతంగా పంట పండిస్తూ... లాభాలు గడించటమే కాకుండా.. మిగతా రైతులకూ ఆదర్శమయ్యారు.

ఉద్యోగాన్ని వదిలేసి.. డ్రాగన్​ఫ్రూట్​ సాగులో విజయం సాధించి..

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన రైతు.. వినపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండును మన రాష్ట్రంలోనే ఎందుకు పండిచట్లేదని ప్రశ్న.. శ్రీనివాస్​రెడ్డి మొదడులో తలెత్తింది. ఎలాగైనా ఈ పండును ఇక్కడ కూడా పండించాలని నిశ్చయించుకున్నారు. డ్రాగన్​ ఫ్రూట్​ పంటకు సంబంధించిన అనేక పరిశోధనలు, మెలకువలు తెలుసుకున్నారు. సాధారణ వర్షాపాతంతోనే పండే ఈ పంటను సాగు చేయటం ప్రారంభించారు.

ఉద్యోగాన్ని సైతం వదిలేసి...

తాను అనుకున్నట్టుగా డ్రాగన్​ ఫ్రూట్​ను ఇక్కడే పండించాలన్న లక్ష్యాన్ని ఛేదించారు. డ్రాగన్​ ఫ్రూట్​ సాగులో విజయం సాధించారు. పంటపై మంచి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ముందుకు సాగి ఇతర రైతులను ప్రోత్సాహించడం కోసం.. తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేశారు శ్రీనివాస్​ రెడ్డి. ఈ సాగుపై తాను సాధించిన విజయ పాఠాలను రైతులతో పంచుకుంటున్నారు. ఎన్నో సార్లు... డ్రాగన్​ ఫ్రూట్​ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించారు.

ఏ భూమిలోనైనా పండే పండు...

"తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు కూడా డ్రాగన్​ ఫ్రూట్​ సాగుకు అనుకూలమే. 10 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి భూములు తప్ప మిగతా ఏ భూముల్లోనైన ఈ పండును పండించొచ్చు. మార్కెట్లో ఈ పండుకు కిలోకు దాదాపు 150 నుంచి 200 వరకు పలుకుతోంది. ఈ పంటను సాగు చేయడానికి మొదట్లో ఎకరాకు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏడాది తర్వాత నుంచి మంచి లాభాలు వస్తాయి."- శ్రీనివాస్​రెడ్డి, రైతు

లాభాల పంట పండిద్దాం...

ఎడారి మొక్క కావడం వల్ల పంటకు తెగులు కూడా సోకే ప్రమాదం చాలా తక్కువ అని శ్రీనివాస్​రెడ్డి చెబుతున్నారు. మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేకుండా.. సేంద్రీయ పద్ధతిలో ఈ సాగు చేయవచ్చంటున్నారు. మొక్క ఎదిగిన సంవత్సరం నుంచే.. పండ్లు చేతికి వస్తాయన్నారు. అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉండి.. మంచి లాభాలు తెచ్చిపెట్టే.. ఈ డ్రాగన్​ ఫ్రూట్​ను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని శ్రీనివాస్​రెడ్డి కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.