ETV Bharat / city

Corona positive for Speaker Pocharam: స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్‌

author img

By

Published : Jan 16, 2022, 10:26 AM IST

Updated : Jan 16, 2022, 11:24 AM IST

corona to speaker pocharam
స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్‌

10:22 January 16

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్

Corona Positive for Speaker Pocharam: శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయింది. రెండు నెలల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న ఆయనకు.. మళ్లీ వైరస్‌ సోకింది.

నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో పోచారం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో స్పీకర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సభాపతి పోచారం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని పోచారం సూచించారు. తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM KCR Cabinet Meeting: కరోనా తీవ్రత, నియంత్రణపై.. రేపు కేబినెట్‌ భేటీ

Last Updated : Jan 16, 2022, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.