ETV Bharat / city

Son abandoned his father : గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లాక్కొని తన్నాడు

author img

By

Published : Oct 5, 2021, 9:52 AM IST

పిల్లలే సర్వస్వమని తమ జీవితాల్ని ధారబోసే తల్లిదండ్రులను వృద్ధాప్యం రాగానే వదిలించుకుంటున్నారు. కన్నపేగు మీద కాస్త కూడా కనికరం లేకుండా రోడ్డుమీదకు నెట్టేస్తున్నారు. కళ్లలో పెట్టుకుని చూసుకున్న వారిపై కాస్త దయ కూడా చూపించడం లేదు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే తల్లి మరణిస్తే.. వారికి అమ్మప్రేమ దూరం కావొద్దని మరో మహిళను వివాహమాడి.. ఈ పిల్లలు చాలు మనకు ఇంకెవ్వరు వద్దని ఆమెను ఒప్పించి.. వారిని అపురూపంగా చూసుకున్నాడో తండ్రి. గుండెల మీద పెట్టుకుని పెంచిన ఆ కన్నపేగు గుండె పగిలేలా ప్రవర్తించి చివరకు గూడు కూడా లేకుండా చేశాడో కనికరంలేని కుమారుడు(Son abandoned his father).

గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లాక్కొని తన్నాడు
గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లాక్కొని తన్నాడు

ముగ్గురు కుమార్తెలు, కుమారులే సర్వస్వం అనుకున్నాడు. వారి చిన్నప్పుడే తల్లి కామెర్ల వ్యాధితో చనిపోతే ఒక్కడే అందర్నీ సాకాడు. పిల్లలకు అమ్మతోడు ఉండాలని మరో పెళ్లి చేసుకున్నాడు. తన పిల్లలనే సొంత చిన్నారులుగా భావించాలని, మళ్లీ పిల్లలు వద్దంటూ ఆమెకు నచ్చజెప్పడంతో అంగీకరించింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుందా తల్లి.. పెంచి పెద్ద చేసి కుమార్తెలకు, కుమారుడికి పెళ్లిళ్లు చేశారు. బాధ్యతలు తీరిపోయినా రెక్కలున్నంత వరకు కష్టపడాలంటూ దొరికిన పని చేస్తూ వచ్చారు. వారి కలలు(Son abandoned his father) కల్లల్లయ్యాయి. అల్లారుముద్దుగా పెంచిన కుమారుడు వారిని రోడ్డుమీదకు తరిమేశాడు(Son abandoned his father). దిక్కున్నచోటికి వెళ్లమని చెప్పాడు. నిస్సహాయ స్థితిలో అవసాన దశలో కూలీ పనులకెళ్తూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. చివరకు సిటీ సివిల్‌ కోర్టు న్యాయసేవాధికార సంస్థ వారిని అక్కున చేర్చుకుంది. కుమారుడిని పిలిపించి మందలించింది. రూ.లక్ష తండ్రికి ఇప్పించడంతో పాటు జీవితాంతం బాగా చూసుకోవాలని ఆదేశించింది.

ముషీరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతుల దీనగాథ ఇది. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ తండ్రికి ఇచ్చిన స్థలంపై కుమారుడి కన్నుపడింది. తల్లిదండ్రులిద్దరూ 8 నెలల పాటు వేరే ఊరికి వెళ్లిన సమయం గమనించి.. వాళ్లు తిరిగొచ్చేసరికి గుడిసెను ఆక్రమించాడు. దాన్ని కూలగొట్టి మూడంతస్తుల ఇల్లు నిర్మించాడు. తల్లిదండ్రులిద్దర్నీ ఇంటి నుంచి గెంటేశాడు(Son abandoned his father). తన భార్యతో కలిసి ఆ ఇంట్లో కింది అంతస్తులో కాపురం పెట్టాడు. పైన రెండు అంతస్తులు అద్దెకిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నాడు.

63 ఏళ్ల వయసులో ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో సికింద్రాబాద్‌లో అద్దెకు ఉంటున్నాడు. కూలీనాలీ చేసుకుంటూ బతుకువెళ్లదీశాడు. పెద్దల పంచాయతీ పెట్టినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా కుమారుడి వైఖరి మారలేదు. కేసు సిటీ సివిల్‌కోర్టు న్యాయసేవాధికారసంస్థ వద్దకు వచ్చింది. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి మురళీమోహన్‌ విచారించారు. తండ్రి, కుమారుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. లోక్‌ అదాలత్‌ న్యాయమూర్తి శ్రీవాణికి కేసును సిఫారసు చేయగా తండ్రికి అనుకూలంగా తీర్పు వెలువడింది. తల్లిదండ్రులిద్దరినీ జీవితాంతం లోటు రాకుండా చూసుకుంటానని కుమారుడితో హామీ పత్రంపై సంతకం తీసుకోవడంతో వృద్ధ దంపతుల(Son abandoned his father)కు ఊరట లభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.