ETV Bharat / city

Singareni Budget Expenditure 2021-22 : సింగరేణి బడ్జెట్‌లో ఖర్చులు అరకొరే

author img

By

Published : Mar 23, 2022, 7:52 AM IST

Singareni Budget Expenditure 2021-22
Singareni Budget Expenditure 2021-22

Singareni Budget Expenditure 2021-22 : సింగరేణి సంస్థకు కేంద్ర సర్కార్ కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు కాలేదని పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. 2021-22లో సింగరేణికి కేటాయించిన బడ్జెట్‌ పూర్తిగా ఖర్చుకాకపోవడానికి కారణం రూ.150కోట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోవడమేనని బొగ్గుశాఖ తెలిపినట్లు స్థాయీసంఘం వెల్లడించింది. కొవిడ్‌ తర్వాత కాంట్రాక్టర్‌ దాని పనులు చేపట్టలేకపోయారని, వాటిని 2022-23లో పూర్తిచేస్తామని చెప్పారని తెలిపింది.

Singareni Budget Expenditure 2021-22 : సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ పూర్తిగా ఖర్చుకాలేదని పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీనికి రూ.2,300 కోట్లు కేటాయించగా ఖర్చయింది రూ.1,310 (57%) కోట్లేనంది. 2021-22 బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించినా అంచనాలు సవరించేటప్పటికి దాన్ని రూ.2వేల కోట్లకు కుదించినట్లు తెలిపింది. అందులోనూ 2022 జనవరి వరకు కేవలం రూ.1,531.88 (76.6%) ఖర్చయినట్లు పేర్కొంది. 2022-23 బడ్జెట్‌లో సింగరేణికి రూ.2వేల కోట్లే కేటాయించినట్లు గుర్తుచేసింది.

Singareni Budget 2021-22 : 2021-22లో సింగరేణికి 68 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించగా 52.54 లక్షల టన్నుల(77%)కు మాత్రమే చేరుకున్నట్లు స్థాయీసంఘం పేర్కొంది. 2022-23లో 72 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించింది. 2021-22లో సింగరేణికి కేటాయించిన బడ్జెట్‌ పూర్తిగా ఖర్చుకాకపోవడానికి కారణం రూ.150కోట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోవడమేనని బొగ్గుశాఖ తెలిపినట్లు స్థాయీసంఘం తెలిపింది. కొవిడ్‌ తర్వాత కాంట్రాక్టర్‌ దాని పనులు చేపట్టలేకపోయారని, వాటిని 2022-23లో పూర్తిచేస్తామని చెప్పారని తెలిపింది.

భారీ బకాయిలు

Telangana in Parliament : సింగరేణికి వివిధ రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలు భారీ మొత్తంలో బకాయి పడినట్లు స్థాయీసంఘం తెలిపింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి 2019లో రూ.1,944 కోట్లు, 2020లో రూ.3,320 కోట్లు, 2021లో రూ.2,693 కోట్లు, 2022లో జనవరి 31 వరకు రూ.5,620 కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొంది.

భారీగా డిస్కంల బకాయిలు

Parliament Budget Sessions 2022 : విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఏపీలోని డిస్కంలు రూ. 7,538 కోట్లు, తెలంగాణ డిస్కంలు రూ. 6,889 కోట్ల మేర బకాయి పడినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని డిస్కంల నుంచి ఉత్పత్తి సంస్థలకు రూ. 1,00,931 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు చెప్పారు. మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ డిస్కంల నుంచి రూ. 6,111.88 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని చెప్పారు. దీనిపై ఆ రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని, దీంతో ఇప్పుడది కోర్టు పరిధిలోని అంశంగా మారిందని ఆర్‌కే సింగ్‌ చెప్పారు.

రూ. 42,293 కోట్ల నష్టాల్లో డిస్కంలు

Telangana DISCOMs are in Loss : తెలంగాణ డిస్కంల నష్టాలు 2018 మార్చి 31 నాటికి రూ. 28,209 కోట్ల వరకు ఉండగా, 2019 మార్చి 31 నాటికి రూ. 36,231 కోట్లకు, 2020 మార్చి 31 నాటికి రూ. 42,293 కోట్లకు చేరాయని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డిస్కంల నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 29,143 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.

‘హార్టీకల్చర్‌ వర్సిటీకి రూ. 135 కోట్లు ఇచ్చాం’

Horticulture Budget 2022 : ఈనాడు, దిల్లీ తెలంగాణలోని హార్టీకల్చర్‌ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.135 కోట్లు ఇచ్చిందని, ఇక మీదట దీనికోసం నిధుల కేటాయింపు ఉండదని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఆయన మంగళవారం లోక్‌సభలో తెరాస ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘2014-15 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో హార్టీకల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 2016-17 వరకు కేంద్ర వ్యవసాయశాఖ రూ. 135 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు యూనివర్సిటీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినందున దీనికి తదుపరి నిధుల విడుదల ఏమీ ఉండదు’ అని తోమర్‌ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో 59 పీజీ మెడికల్‌ సీట్లు ఖాళీ

తెలంగాణలో 2020-21 విద్యాసంవత్సరంలో 59 మెడికల్‌ పీజీ సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో తెరాస ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఆసుపత్రుల బలోపేతం, ఆధునికీకరణ, కొత్తవాటి నిర్మాణం కోసం 2016-17నుంచి 2020-21 వరకు తెలంగాణకు రూ. 727 కోట్లు కేటాయించగా, రూ. 254 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.