ETV Bharat / city

తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

author img

By

Published : Nov 2, 2020, 10:14 AM IST

ఏపీలో పాఠాశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబందనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించటంతోపాటు... ప్రభుత్వం అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.

తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

నవంబర్ 2 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వరకున్న పనిదినాల్లో 144 రోజులు బడుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో ఈసారి 30శాతం తక్కువ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఒక్కో తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి విద్యార్థి మాస్కు, నీళ్ల సీసా ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మాస్కు ధరిస్తేనే ఎవరినైనా పాఠశాలల్లోకి అనుమతించాలని, ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా థర్మల్‌ స్కానింగ్‌ చేయాలని సూచిందింది. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలోనే బోధన చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా కేసులు.. 7 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.