రాష్ట్రవ్యాప్తంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

author img

By

Published : Aug 18, 2022, 6:57 PM IST

Updated : Aug 18, 2022, 7:34 PM IST

Sardar Sarvai Papanna Birth Anniversary

Sardar Sarvai Papanna Birth Anniversary అణిచివేతపై తిరుగుబాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, అధికారులు సర్వాయి పాపన్నకు నివాళులర్పించారు. ఆనాడు సమాజంలో జరిగిన అన్యాయాలను ఎదిరించిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న అంటూ కొనియాడారు.

Sardar Sarvai Papanna Birth Anniversary: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్పూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను స్మరించుకున్నారు. నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి... పాపన్న పోరాడిన తీరు గొప్పదని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకులను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు. నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పాపన్న పోరాడిన తీరు గొప్పదని మంత్రులు కొనియాడారు. నాంపల్లిలోని భాజపా కార్యలయంలో నిర్వహించిన పాపన్న జయంతి వేడుకలకు రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని విజయశాంతితో కలిసి ఆవిష్కరించారు.

వివిధ జిల్లాల్లో సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌడ కులస్తులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలో కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. నిర్మల్ లో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పాపన్న విగ్రహానికి పూలమాల వేసి.. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో పాపన్న గౌడ్ జయంతోత్సవాలు అధికారికంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి భారతి హోలీ కేరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఇవీ చదవండి:

Last Updated :Aug 18, 2022, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.