ETV Bharat / city

'కేసీఆర్ వల్లే చల్లగున్నాం.. అందుకే ఆరోజు మొక్కలు నాటుతాం'

author img

By

Published : Feb 15, 2020, 4:22 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటుతామని పేర్కొంది.

'మీ పుట్టినరోజున మేం మెుక్కలు నాటుతాం'
'మీ పుట్టినరోజున మేం మెుక్కలు నాటుతాం'

'మీ పుట్టినరోజున మేం మెుక్కలు నాటుతాం'

సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన మానసపుత్రిక హరితహారంలో భాగంగా 2600 రైస్‌ మిల్లుల్లో 10 నుంచి 15 చొప్పున మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేంద్ర తెలిపారు. 33 జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కారాగారాల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ ఖైరతాబాద్‌ తాజ్‌ ఎన్‌క్లేవ్‌లోని రైస్ మిల్లర్స్ అసోయేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనతో ధాన్యం దిగుబడి పెరిగిందని, తద్వారా తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు.

గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితిలేదని రెప్పపాటు విద్యుత్ కోతలు లేవని ఆ సంఘం ఉపాధ్యక్షుడు దయాకర్ అన్నారు. చిన్నచిన్న సమస్యలు ఉన్పప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న రైస్‌పరిశ్రమ బలోపేతం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.