REVANTH REDDY: చర్చకు నేను సిద్ధం.. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తా: రేవంత్​రెడ్డి

author img

By

Published : Aug 25, 2021, 6:58 PM IST

Updated : Aug 25, 2021, 7:32 PM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-August-2021/12873537_revanth.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-August-2021/12873537_revanth.jpg ()

మూడుచింతలపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపులో భాగంగా మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో నాలుగేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఉంచే బొడ్డురాయి దగ్గర చర్చకు సిద్ధమని.. నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

మూడుచింతలపల్లి కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష

మూడుచింతలపల్లిలో ప్రజలు వ్యవసాయం మీదే ఆదారపడి జీవనం సాగిస్తున్నారని పీసీసీ అధినేత రేవంత్​ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో పేదలకు ఇచ్చిన హామీల ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గ్రామంలో పేదలందరికి డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తానని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామానికి ఇచ్చిన అన్ని హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. హామీలు పూర్తి చేసి ఉంటే బొడ్డురాయి దగ్గరే చర్చపెడదామన్నారు. హామీలు పూర్తి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు..

మంత్రి మల్లారెడ్డికి యూనివర్శిటీకి ఇచ్చిన భూమిపై పీసీసీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు పత్రాలతో మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి భూ అక్రమాలపై సీఎం కేసీఆర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.మల్లారెడ్డి నిర్దోషి అని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు

పోరాటం ఆగదు..

దళితబంధు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని దళితులకు, గిరిజనులకు దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం ఇప్పుడే ఆగదని, ప్రతి దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగుతుందన్నారు.

తొలిసంతకం వాటిపైనే..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలిసంతకం దళిత,ఆదివాసి,గిరిజన సంక్షేమం కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించేలా చొరవ తీసుకుంటానని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరైనా సరే పార్టీ పరంగా అధ్యక్షుడే నంబర్ వన్ అని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా మాట ఇస్తున్నాని తేల్చి చెప్పారు.

సంబంధిత కథనం: REVANTH REDDY: దళితబంధు కోసం సచివాలయం, అసెంబ్లీ అమ్మేద్దాం: రేవంత్‌ రెడ్డి

Last Updated :Aug 25, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.