ETV Bharat / city

కొహెడ మార్కెట్​ను పరిశీలించిన రాచకొండ సీపీ

author img

By

Published : Apr 30, 2020, 12:02 AM IST

కొహెడలో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్​ను రాచకొండ సీపీ మహేశ్ ​భగవత్​ పరిశీలించారు.

Rachakonda CP Visits koheda Fruit Market
కొహెడ మార్కెట్​ను పరిశీలించిన రాచకొండ సీపీ

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ మండలంలోని కొహెడలో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్​ను రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తీసుకొచ్చిన మామిడి పండ్లను ఆయన పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన మామిడి పండ్ల మధ్యలోంచి బూటుకాళ్లతో నడవడం ఇష్టంలేక బూట్లు విడిచి మామిడికాయల మధ్య నడిచారు. ఈ విషయం మార్కెట్లో చర్చనీయాంశమయింది. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సీపీ సూచించారు.

ఇవీ చూడండి: దివ్యాంగ న్యాయవాదిని చావబాదిన ఎస్సైపై హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.