ETV Bharat / city

PUSHPA TEAM AT TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో పుష్ప చిత్ర బృందం

author img

By

Published : Dec 22, 2021, 11:45 AM IST

Pushpa movie team visited Tirumala: పుష్ప చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

PUSHPA TEAM AT TIRUMALA, puspa team ttd
తిరుమల శ్రీవారి సేవలో పుష్ప చిత్ర బృందం

తిరుమల శ్రీవారి సేవలో పుష్ప చిత్ర బృందం

Pushpa movie team visited Tirumala: తిరుమల శ్రీవారిని పుష్ప చిత్ర బృందం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్రం విజయవంతం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు నిర్మాత నవీన్ చెప్పారు. పుష్ప చిత్రం పార్ట్- 2ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు చెప్పారు.

పుష్ప సినిమా విడుదలై.. ఘనవిజయం సాధించింది. అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చాం. అందుకు చెవిరెడ్డి భాస్కర్​రెడ్డికి మా ధన్యవాదాలు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ఫస్ట్ వీక్​లో పుష్ప రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

-పుష్ప టీం

ఓటీటీలో పుష్ప ఎప్పుడంటే?

Pushpa OTT Release: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' చిత్రం అభిమానులకు ఫుల్​మీల్స్​ పెట్టేసింది. బన్నీ​-సుకుమార్​ కాంబినేషన్​ మరోసారి అదరగొట్టేసింది. దీంతో ప్రేక్షకులు 'పుష్ప'ను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అయితే థియేటర్లలో ఈ మూవీ హవా కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్​పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చిత్రం డిజిటల్​ రైట్స్​ ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో 'పుష్ప-ది రైజ్'​ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్​లో రిలీజ్​ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన చిత్రబృందం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ఈ సినిమా జనవరి చివరి వారంలో ప్రైమ్​లో అందుబాటులోకి వస్తుంది.

బన్నీ ధీమా

Pushpa success meet: తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో విడుదలైన అన్ని కేంద్రాల్లో 'పుష్ప' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆ చిత్ర నిర్మాతలు ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో రూ.173 కోట్ల వసూళ్లు సాధించిందని వెల్లడించారు. 'పుష్ప' సినిమా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని హీరోహీరోయిన్ మధ్య లవ్​ట్రాక్​.. తన నిజజీవితంలో నుంచి స్ఫూర్తితో తెరకెక్కించానని సుకుమార్ అన్నారు. ఈ విషయం తెలిసిన తన భార్య.. తిట్టిందని చెప్పారు. అలానే 'పుష్ప' పార్ట్​-2 తగ్గేదే లే అని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశారు.

పబ్లిక్ టాక్

Pushpa Public Talk: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' శుక్రవారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సుకుమార్​ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రివ్యూస్​​ వస్తున్నాయి. అయితే థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ఎలా ఉందో మీరే చూసేయండి.

ఇదీ చదవండి.. 'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌'.. ట్రోల్‌పై స్పందించిన సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.