ETV Bharat / city

ఏపీలో విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం.. ఔట్​సోర్సింగ్​ ఉద్యోగం

author img

By

Published : Feb 8, 2021, 9:34 PM IST

ఏపీలో కళాశాల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తేజశ్రీ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున విద్యార్థిని కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

govt help ten lakh rupees for btech student suicide
విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం.. ఔట్​సోర్సింగ్​ ఉద్యోగం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో.. కళాశాల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న తేజశ్రీ నివాసానికి జిల్లా కలెక్టర్ భాస్కర్ వెళ్లారు. విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థిని అక్కకు అవుట్​ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

2018 - 19 ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు అన్నీ విడుదల అయ్యాయని.. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు మాత్రం నిధులు విడుదల కాలేదని చెప్పారు. కళాశాలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో.. ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఆ కేసును నవంబర్ 2020లో కాలేజీ యాజమాన్యం విత్​డ్రా చేసుకుందని... ఎన్నికలు పూర్తైన తర్వాత నిధులు విడుదల చేస్తామని అన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు అవుతుంది.. చైనీయుల కొత్త మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.