ETV Bharat / city

భార్గవరామ్‌ బెంగళూరులో ఉన్నాడా.. పుణె వెళ్లాడా?

author img

By

Published : Jan 10, 2021, 4:50 AM IST

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక వ్యక్తైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ కోసం పోలీసులు మూడు రాష్ట్రాలకు తరలివెళ్లారు. బెంగళూరులో ఉన్నాడన్న సమాచారం, పుణెలో తలదాచుకున్నాడన్న అనుమానంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. కిడ్నాప్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీనును పట్టుకునేందుకు మరో బృందం ఏపీలో గాలిస్తోంది. అపహరణకు వాడిన కార్లను గుర్తించే యత్నాలు కొనసాగుతున్నాయి.

Bhargavaram
భార్గవరామ్‌ బెంగళూరులో ఉన్నాడా.. పుణె వెళ్లాడా?

ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌ కేసులో కీలక వ్యక్తి అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ కోసం బోయిన్‌పల్లి పోలీసులు మూడు రాష్ట్రాలకు తరలివెళ్లారు. బెంగళూరులో ఉన్నాడన్న సమాచారం, పుణెలో తలదాచుకున్నాడన్న అనుమానంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. కిడ్నాప్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీనును పట్టుకునేందుకు మరో బృందం ఏపీలో గాలిస్తోంది. అపహరణకు వాడిన కార్లను గుర్తించే యత్నాలు కొనసాగుతున్నాయి.

రెండుసార్లు అఖిలప్రియకు వైద్య పరీక్షలు


అఖిలప్రియ తరఫు న్యాయవాదులు శుక్రవారం రాత్రి ఆమెను చంచల్‌గూడ జైల్లో కలిశారు. అనారోగ్య సమస్యలున్నాయని ఆమె న్యాయవాదులకు వివరించారు. ఈ విషయాలను వారు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఆమే స్వయంగా తన పరిస్థితిని జైలు అధికారులకు వివరించారు. దీంతో శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించినట్లు జైలు పర్యవేక్షణాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. నివేదికను సోమవారం సికింద్రాబాద్‌ కోర్టులో సమర్పించనున్నామన్నారు. తాను పదేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని, ఉస్మానియా ఆర్‌ఎంవో డా.ప్రసాద్‌, డా.సౌమ్యలకు అఖిలప్రియ వివరించారు. వైద్య పరీక్షల అనంతరం న్యూరో ఫిజీషియన్‌ వద్దకు వెళ్లాల్సిందిగా ఆమెకు సూచించామని డా.సౌమ్య, ఉస్మానియా సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ తెలిపారు.

ఇవీ చూడండి: తీరని దుఃఖం: తీగపై దుస్తులు ఆరేస్తూ.. నలుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.