ETV Bharat / city

పోలీస్​స్టేషన్​లో ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు

author img

By

Published : Jul 21, 2020, 7:55 PM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక లారీలను ఆపినందుకు వరప్రసాద్​ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి శిరోముండనం చేశారు. అంతటితో ఆగకుండా తీవ్రగాయలయ్యేలా కొట్టారు.

పోలీస్​స్టేషన్​లో ఎస్సీ యువకుడికి గుండు కొట్టిన పోలీసులు
పోలీస్​స్టేషన్​లో ఎస్సీ యువకుడికి గుండు కొట్టిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లోనే ఎస్సీ యువకుడు వరప్రసాద్​కు శిరోముండనం చేశారు పోలీసులు. యువకుడిని కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలను ఆపినందుకు దాడిచేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక వైకాపా నాయకుడు వచ్చాడు. అతడి అనుచరుడి ఫిర్యాదుతో వరప్రసాద్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీతానగరం పీఎస్‌కు తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లిన వరప్రసాద్​కు శిరోముండనం చేసిన పోలీసులు... తీవ్రగాయలయ్యేలా కొట్టారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్‌.ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై డీఎస్పీ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించా: ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.