ETV Bharat / city

PET Candidates Protest: 'ఉద్యోగాలైన ఇవ్వండి లేదంటే.. కారుణ్య మరణాలకైనా అనుమతివ్వండి'

author img

By

Published : Sep 2, 2021, 7:40 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని పీఈటీ అభ్యర్థులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా కార్యాలయం ముందే బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళన చేశారు. ట్రాఫిక్​కు ఇబ్బంది కలగడంతో పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.

pet-candidates-protest-at-tspsc-office-at-nampally
pet-candidates-protest-at-tspsc-office-at-nampally

పీఈటీ పోస్టుల భర్తీ ఫలితాలు వెంటనే ప్రకటించి నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలైన ఇవ్వండి లేదంటే... కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కమిషన్​ను మహిళా అభ్యర్థులు వేడుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని పీఈటీ అభ్యర్థులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు అభ్యర్థించినా.. అనుమతించకపోవటం వల్ల కార్యాలయం ముందే బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళన చేశారు. ట్రాఫిక్​కు ఇబ్బంది కలగడంతో పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే పోస్టింగులు ఇవ్వాలి...

"పక్షం రోజుల్లో నియామకాలు చేపట్టాలని మార్చి 8న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ హిమాకోహ్లి తీర్పునిచ్చారు. ఆరు నెలలైనా ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదంటే.. తమ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. హైకోర్టు తీర్పును కూడా టీఎస్పీఎస్సీ లెక్కచేయట్లేదు. పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. మాకు మాత్రం పోస్టింగులు ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు ప్రకారం వెంటనే టీఎస్పీఎస్సీ గురుకుల పీఈటీ నియామకాలు చేపట్టాలి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్​ దృష్టి పెట్టి.. వారం రోజుల్లో నియమకాలు చేపట్టాలి. లేకుంటే.. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలి"- పీఈటీ అభ్యర్థులు

'ఉద్యోగాలైన ఇవ్వండి లేదంటే.. కారుణ్య మరణాలకైనా అనుమతివ్వండి'

ఇదీ చూడండి: MLA ABRAHAM: ఎమ్మెల్యేతో రైతుల వాగ్వాదం.. ఎందుకో తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.