ETV Bharat / city

Opposition parties Maha Dharna: ఇందిరాపార్కు వద్ద మహాధర్నా... సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపుపై నిరసన

author img

By

Published : Sep 22, 2021, 1:19 PM IST

Updated : Sep 22, 2021, 1:28 PM IST

Opposition parties Maha Dharna
ఇందిరాపార్కు వద్ద మహాధర్నా

హైదరాబాద్ఇందిరాపార్కు వద్ద విపక్షాలు మహాధర్నా (Opposition parties Maha Dharna) చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యతిరేకిస్తూ... పోరు బాట పట్టాయి. ధర్నాలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, రేవంత్​రెడ్డి (Revanth), సీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం, బక్కిన నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి, కోదండరెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద (indira park) కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీల మహాధర్నా (Opposition parties Maha Dharna) నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో... కాంగ్రెస్, తెజస, సీపీఎం, సీపీఐ, తెదేపా, సీపీఐ ఎంఎల్​ లిబరేషన్, ఎంఎల్​ న్యూడెమోక్రసి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బీఎస్పీ, వైతెపా మహాధర్నాకు హాజరుకాలేదు.

పోలీసుల ఆంక్షలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపునకు నిరసనగా పోరు బాట పట్టాయి. ఉపాధి హామీ పని దినాలు, కూలీ ధరలు పెంచాలని డిమాండ్ చేశాయి. ఈ మహాధర్నాకు పోలీసులు మధ్యాహ్నం 3 గంటల వరకే అనుమతినిచ్చారు. 200 మందికి మించి పాల్గొనరాదని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని నిబంధనలు పెట్టారు.

సంపన్నులకు లాభం చేకూరేలా ధరణీ చట్టం: కోదండరాం

ధర్నాలో ప్రసంగించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం (tjs kondanda ram)... డిమాండ్ల సాధన మొదలు పెడితే.. కేసీఆర్ (kcr) నల్ల చట్టాలు తెర మీదకు తెస్తున్నారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​ ఒక్కడే ప్రగతిభవన్​లో ఉంటే.. ప్రతిపక్షాలన్నీ ఇందిరాపార్క్​ వద్ద ఉన్నాయని అన్నారు. తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని వెల్లడించారు. కొవిడ్​ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని పేర్కొన్నారు. సంపన్నులకు లాభం చేకూరేలా ధరణి చట్టం ఉందని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. ఈనెల 30న వినతిపత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు. వచ్చే నెల 5న పోడు సమస్యల ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని అన్నారు.

ఇందిరాపార్కు వద్ద మహాధర్నా... సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపుపై నిరసన

ఇదీ చూడండి:

Last Updated :Sep 22, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.