ETV Bharat / city

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిజాం కళాశాల విద్యార్థుల నిరసన

author img

By

Published : Sep 16, 2019, 4:43 PM IST

నిజాం కళాశాల విద్యార్థుల నిరసన

ప్రాణాధారమైన అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నిజాం కళాశాల విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా... "సేవ్ నేచర్ - సేవ్ నేషన్" అంటూ నినాదాలు చేస్తూ... కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రజా జీవనాధారమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా నిజాం కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. ఆర్డినెన్స్​ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. సేవ్​ నేచర్​​ - సేవ్​ నేషన్ అంటూ నినాదాలు చేశారు. అడవులను ధ్వంసం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి వెనక్కు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

నిజాం కళాశాల విద్యార్థుల నిరసన
ఇదీ చూడండి: మా మోకాళ్లు కనిపిస్తే మీకేంటి?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.