ETV Bharat / city

పోచమ్మ ఆలయ ముఖద్వార పనులను ప్రారంభించిన తలసాని

author img

By

Published : Jan 31, 2021, 7:12 PM IST

Minister Talasani inaugurated the construction work of the entrance of Pochamma Temple in Secunderabad
పోచమ్మ ఆలయ ముఖద్వార పనులను ప్రారంభించిన తలసాని

సికింద్రాబాద్‌లో పోచమ్మ ఆలయ ముఖద్వార నిర్మాణ పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. రూ.9 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు.

సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని దేవీనగర్‌లో ఉన్న పోచమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రూ.9 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆలయ ముఖద్వార నిర్మాణ పనులను మంత్రి శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, ఏసూరి మహేశ్‌, దేవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, అరుణ్ గౌడ్, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆదాయం లేని హల్ట్ స్టేషన్ల తాత్కాలిక మూసివేత : ద.మ. రైల్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.