ETV Bharat / city

'కళాకారులతో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసేలా కార్యక్రమాలు..'

author img

By

Published : Feb 22, 2022, 5:10 AM IST

హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సాంస్కృతిక శాఖపై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సమ్మేళనాలు, పోటీలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు.

Minister Srinivas Goud Review Meeting on  Department of Cultural activities
Minister Srinivas Goud Review Meeting on Department of Cultural activities

తెలంగాణ సాహిత్య అకాడమీ , సంగీత నాటక అకాడమీల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సమ్మేళనాలు, పోటీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సాంస్కృతిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరి శంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర సమాచార శాఖ ఉన్నతాధికారులు కిషోర్ బాబు, మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడానికి, తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని ఆట - పాటల ద్వారా ప్రజలకు వివరించానున్నాం. ఇందుకోసం "తెలంగాణ సాంస్కృతిక సారథి" సంస్థ కళాకారులను పూర్తి స్థాయిలో సేవలను విస్తరించేందుకు అవగాహన సదస్సును ఫిబ్రవరి 26న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్‌ ఛానెల్, అధునాతన పాటల రికార్డింగ్ స్టూడియోను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి. సాంస్కృతిక సారథి కళాకారులను సమన్వయం చేయడంలో రాష్ట్ర సమాచార శాఖ అధికారులు, జిల్లాలోని కలెక్టర్లు, జిల్లా పౌర సమాచార శాఖ అధికారులు పూర్తిగా సహకరించుకోవాలి." - శ్రీనివాస్​ గౌడ్​, మంత్రి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.