ETV Bharat / city

Ktr : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆన్​లైన్ తరగతులపై సర్కార్ దృష్టి

author img

By

Published : May 31, 2021, 7:56 PM IST

జూన్ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్​లైన్ తరగతుల నిర్వహణ అంశంపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి.. ఈ అంశంపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు.

మంత్రి కేటీఆర్, తెలంగాణలో విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్​లైన్ తరగతుల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్​కు తెలిపారు.

సర్కారు బడుల్లో ఆన్​లైన్ బోధన చేపట్టాలని, జూన్ నుంచి ప్రైవేట్ పాఠశాలలు ఆ దిశగా సిద్ధమవుతున్నాయని కోరుతూ కేటీఆర్​కు తెలుగు ఉపాధ్యాయురాలు సునీత ట్వీట్ చేశారు. సునీత ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. ఆ అంశాన్ని పరిశీలించాలని సబితా ఇంద్రారెడ్డిని కోరారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆన్​లైన్ విధానాలతో ఎలా చేరువ కావాలనే మార్గాలను పరిశీలిస్తున్నామని కేటీఆర్​కు ట్విట్టర్ ద్వారా సబితా ఇంద్రారెడ్డి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.