ETV Bharat / city

High Court: 'హైకోర్టును కర్నూలుకు తరలించటమే ప్రభుత్వ నిర్ణయం'

author img

By

Published : Aug 2, 2022, 7:52 PM IST

High Court: 'హైకోర్టును కర్నూలుకు తరలించటమే ప్రభుత్వ నిర్ణయం'
High Court: 'హైకోర్టును కర్నూలుకు తరలించటమే ప్రభుత్వ నిర్ణయం'

BUGGANA: రానున్న రోజుల్లో ఏపీలోని కర్నూలులో హైకోర్టు (High Court) ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) స్పష్టం చేశారు. జిల్లాలో నగరపాలక సంస్థ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులు పొందిన తర్వాత.. కర్నూలుకు హైకోర్టు (high court to Kurnool) తీసుకు వస్తామన్నారు.

Minister on Buggana on High Court: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు హైకోర్టును తరలించటమే ప్రభుత్వ నిర్ణయమని.. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేశ్​లతో కలిసి.. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. బిర్లా గేట్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్, ఆనంద్ టాకీస్ వద్ద హంద్రీనదిపై వంతెనను ప్రారంభించారు. కర్నూలు నగరపాలక సంస్థ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులు పొందిన తర్వాత.. కర్నూలుకు హైకోర్టును తీసుకువస్తామన్నారు.

High Court: 'హైకోర్టును కర్నూలుకు తరలించటమే ప్రభుత్వ నిర్ణయం'

కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (National Law University): జిల్లాలోని జగన్నాథగట్టుపై త్వరలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, రానున్న రోజుల్లో హైకోర్టు సైతం ఏర్పాటు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు నగరపాలక కార్యాలయ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరపాలక నూతన కార్యాలయాన్ని అన్ని హంగులతో రూ.28 కోట్లతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్​ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అంతకుముందు డిప్యూటీ మేయర్‌-2 కార్యాలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, డా. సుధాకర్‌, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, మేయర్‌ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

రైతులను పొట్టబెట్టుకున్న రాకాసి పిడుగులు.. ఒకేరోజు వేర్వేరు చోట్ల ముగ్గురు బలి..

లాన్ బౌల్స్​లో భారత్​కు స్వర్ణం.. కామన్​వెల్త్​లో తొలిసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.