ETV Bharat / city

జోన్ల పునర్​వ్యవస్థీకరణను ఆమోదించాలి: ఎంపీ రంజిత్​రెడ్డి

author img

By

Published : Mar 17, 2021, 7:36 PM IST

జోన్ల పునర్​వ్యవస్థీకరణను ఆమోదించాలని లోక్​సభలో ఎంపీ రంజిత్​రెడ్డి కేంద్ర సర్కారును కోరారు. ప్రతిపాదనలు పెండింగ్​లో ఉండడం వల్ల జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేకపోతోందన్నారు. ఐటీఐఆర్​పై మరోసారి కేంద్రాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి వివరణ కోరారు.

జోన్ల పునర్​వ్యవస్థీకరణను ఆమోదించాలి: ఎంపీ రంజిత్​రెడ్డి
జోన్ల పునర్​వ్యవస్థీకరణను ఆమోదించాలి: ఎంపీ రంజిత్​రెడ్డి

రాష్ట్రంలో జోన్ల పునర్‌ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు ఆమోదం తెలపాలని తెరాస పార్లమెంట్‌ సభ్యుడు రంజిత్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రూల్‌ నంబర్ 377 కింద లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రంజిత్ రెడ్డి... మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జోగులాంబ జోన్-7లో ఉన్న వికారాబాద్ జిల్లాను.. చార్మినార్ జోన్-6 కిందకు చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రెండుప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉండటంతో జోనల్, మల్టీజోనల్, జిల్లా క్యాడర్ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నట్లు రంజిత్‌ రెడ్డి... కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి.. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు.

ఐటీఐఆర్​పై మరోసారి కేంద్రాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి వివరణ కోరారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసినట్లు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీశాఖ మంత్రి.. ఐటీఐఆర్​ రద్దు చేస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఐటీఐఆర్​ను పునరుద్ధరించాలని గతంలో మూడుసార్లు రాష్ట్రప్రభుత్వం లేఖ రాసిందన్న కేంద్రం.. మారిన పరిస్థితుల దృష్ట్యా.... ఆ విధానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్‌షిప్‌లను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

జోన్ల పునర్​వ్యవస్థీకరణను ఆమోదించాలి: ఎంపీ రంజిత్​రెడ్డి

ఇదీ చదవండి: 'పరస్పర సహకారంతోనే ఉమ్మడి శత్రువుపై పోరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.