ETV Bharat / city

రెండు రోజులుగా వర్షాలు.. తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు

author img

By

Published : Jul 6, 2022, 5:16 PM IST

Landslides Broken: తిరుమల రెండో కనుమదారిలో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి.

landslides-broken-at-tirumala
landslides-broken-at-tirumala

రెండు రోజులుగా వర్షాలు.. తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు

Landslides Broken: ఏపీవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. 2, 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా జల్లులు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. చాలాచోట్ల ఉరుములతో జల్లులు పడతాయని సూచించారు.

వర్షాలకు తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ కనుమదారిలోని ఓ ప్రాంతంలో బండరాళ్లు నేలకు జారాయి. స్వల్పంగానే బండరాళ్లు జారడంతో వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అప్రమత్తమైన తితిదే అధికారులు.. జారిపడిన కొండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.