ETV Bharat / city

'గ్రామాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలి'

author img

By

Published : Feb 25, 2020, 3:28 PM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని గుమ్మడివెల్లి గ్రామాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి దత్తత తీసుకున్నారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా రానున్న నాలుగేళ్లలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని గ్రామస్థులను కోరారు.

Kishanreddy Adopted Gummadavelli Villege
గుమ్మడివెల్లిని గ్రమాన్ని దత్తత తీసుకున్న కిషన్​రెడ్డి

ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా కందుకూరు మండలం గుమ్మడివెల్లిని గ్రమాన్ని దత్తత తీసుకున్నారు. గుమ్మడివెల్లిని సందర్శించి, గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీలకతీతంగా అంతా కలిసి అభివృద్ధి చేసుకుందామని గ్రామస్తులకు వివరించారు.

రాబోయే రోజుల్లో..

ఎస్సీ, ఎస్టీ, చేతివృత్తుల వాళ్లకు ఏమి కావాలో చర్చించుకుందామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ది కోసం ఎన్టీవోలను భాగస్వామ్యం చేస్తానని భరోసా ఇచ్చారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గ్రామ ప్రజలతోనే ఉంటానని వాగ్ధానం చేశారు. గ్రామాభివృద్దిలో సగభాగం మహిళల భాగస్వామ్యం ఉండాలని కోరారు.

గుమ్మడివెల్లిని గ్రమాన్ని దత్తత తీసుకున్న కిషన్​రెడ్డి

ఇవీ చూడండి: 'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.