ETV Bharat / city

'వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు పోరాటాలు కొనసాగుతాయి'

author img

By

Published : Dec 26, 2020, 3:23 PM IST

హైదరాబాద్ సైఫాబాద్​లో జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంత విష్ణు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదనే విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో చూశామని విష్ణు హెచ్చరించారు.

jai mahabharat party president vishnu support to farmers protest
jai mahabharat party president vishnu support to farmers protest

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు రైతులకు అండగా ఉంటామని... జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంత విష్ణు తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్​లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా మోదీ సర్కారు... రైతాంగ చట్టాలను తీసుకొచ్చిందని విష్ణు ఆరోపించారు. దేశంలోని రైతులు బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని విమర్శించారు.

రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదనే విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో చూశామని వివరించారు. ఆహార భద్రత కలిపిస్తూ... నిత్యావసర ధరలను అదుపులో ఉంచవల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ పన్ను కూడా తగ్గించాలని కోరారు. పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని పరిశ్రమలను పటిష్ఠపరిచి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమన్నారు.

ఇదీ చూడండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.