కోతులతో నిత్యం సమస్యగా మారిందా? అయితే మీరు ఈ పద్ధతిని పాటించండి చాలు!

author img

By

Published : Sep 7, 2022, 6:07 PM IST

Iron pity

Monkeys nuisance పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా, నివాస గృహాలు పంట పొలాల్లో వానర మూకల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జన సమూహాల్లోనూ ఇవి చేసే పనులకు అందరూ ఆశ్చర్యంగా చూడాల్సిందే. ఏమైనా ఎదురు తిరిగితే దాడికి యత్నిస్తాయి. అటువంటి వాటిని రక్షణ పొందేందుకు ఈ గ్రామం వారు చేసిన పనికి అందరూ ఫిదా అవ్వాల్సిందే! అసలు ఏంటా పని?

Monkeys nuisance: ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఇంట్లోకి వెళ్లాలన్నా ఎన్నో అవస్థలు పడేవారు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, ముసలివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ కోతుల సమస్యలకు పరిష్కారం గురించి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ఒక్కటీ వాటి విషయంలో పనిచేయకపోవడంతో చివరిగా వచ్చిన ఆలోచనతో ఫలితాన్ని సాధించాడు. అదే ఇంటి చుట్టూ ఇనుప జాలిని ఏర్పాటు చేయడం. ఇది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఓలం బుచ్చిలింగం అనే గృహ యజమాని తన ఇంటి చుట్టూ ఇనుప జాలీలతో కూడిన రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నాడు.

దీంతో కోతుల సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దొరికింది. వరంగల్​ నుంచి ఈ పనిలో ప్రావీణ్యం ఉన్న వారిని తీసుకువచ్చి ఇంటి మొత్తాన్ని ఇనుప జాలితో పూర్తిగా మూసివేశారు. ఇంతటితో వానర మూకల సమస్య నుంచి పూర్తిగా విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 3 లక్షల 50 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని యజమాని తెలిపారు.

వీరిని చూసి ఆంజనేయస్వామి దేవాలయం వారు దేవాలయానికి వచ్చిన భక్తులకు కోతుల నుంచి నిత్యం బెడద ఏర్పడుతుందని గమనించారు. దీంతో ఈయన చేసిన పద్ధతిలోనే ఇనుప జాలిలతో గుడి చుట్టూ నిర్మించాలని గ్రామస్థులు భావించారు. అందుకు తగిన విధంగానే గ్రామస్థులు, దాతలు కలిపి చందాలు వేసుకొని దేవాలయం చుట్టూ ఇనుప వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇలా నిర్మించడం వల్ల కోతులు దేవాలయంలోకి రాకుండా ఉంటున్నాయని గ్రామస్థులు తెలిపారు. పూలు, పండ్లు వంటివి ఎత్తుకుపోకుండా ఉంటున్నాయని చెప్పారు. తమ గ్రామంలో ఈ కోతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

కోతుల బెడద నుంచి రక్షణగా ఇనుప జాలీల ఏర్పాటు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.