అంతర్జాతీయ నర్సింగ్​ సదస్సుకు లక్ష్మణ్​కు ఆహ్వానం

author img

By

Published : Jan 30, 2020, 5:25 PM IST

2nd Asia Pacific Conference on Nursing Science and Healthcare

ఇండోనేషియాలోని బాలిలో మార్చి 20, 21 తేదీల్లో జరగనున్న రెండో ఆసియా పసిఫిక్​ సదస్సుకు తెలుగు నర్సింగ్ అసోసియేషన్​ అధ్యక్షుడు లక్ష్మణ్​ రుదావత్​కు ఆహ్వానం అందింది. నర్సింగ్​ సైన్స్​ అండ్​ హెల్త్​కేర్​పై జరిగే కార్యక్రమానికి స్పీకర్​గా వ్యవహరించాలని రుదావత్​ను కోరారు.

అంతర్జాతీయ నర్సింగ్​ సదస్సుకు తొలిసారిగా తెలుగు నర్సింగ్ అసోసియేషన్​ అధ్యక్షుడు లక్ష్మణ్ రుదావత్​కు ఆహ్వానం అందింది. ఇండియన్​ జర్నల్​ ఆఫ్​ హెల్త్​ రీసెర్చ్​, డెవలప్​మెంట్​తో ప్రపంచవ్యాప్త ప్రచురణ కలిగి ఉన్న బయోలిగెస్, మార్చి 20, 21న 'నర్సింగ్​ సైన్స్​ అండ్​ హెల్త్​ కేర్'​పై రెండో ఆసియా పసిఫిక్​ కాన్ఫరెన్స్​ నిర్వహిస్తోంది. ఇండోనేషియాలోని బాలి ఇందుకు వేదిక కానుంది.

INTERNATIONAL NURSING MEETING
లక్ష్మణ్​ రుదావత్

ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్​ కమిటీ సభ్యుడు, కాన్ఫరెన్స్​ స్పీకర్​గా వ్యవహరించాలని తెలుగు నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్​ రుదావత్​కు ఆహ్వానం అందింది. నర్సింగ్​, హెల్త్​కేర్​లో అనుభవం, సామర్థ్యం ఆధారంగా కాన్ఫరెన్స్ స్పీకర్​ వంటి గౌరవనీయమైన స్థానానికి తనను ఆహ్వానిస్తున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.

international nursing conference
అంతర్జాతీయ నర్సింగ్​ సదస్సుకు లక్ష్మణ్​కు ఆహ్వానం

ఇవీచూడండి: 'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.