ETV Bharat / city

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

author img

By

Published : Oct 23, 2019, 5:00 PM IST

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

విశాఖపట్నం​ నుంచి హైదరాబాద్, నిజామాబాద్​కు గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్​బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టురట్టైంది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 80 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్​ కారు, రూ.4,200 నగదు, 4 చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నేరేడ్‌మెట్‌లోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ గంజాయి స్మగ్లర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.15.20 లక్షలుగా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఉండే నలుగురు స్నేహితులు కలిసి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు. విశ్వసనీయమైన సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

ఇవీ చూడండి: మొదటి భార్యను మర్చిపోలేక రెండో భార్యను...

TG_HYD_10_23_MLKG_CP_PC_AB_TS10015 Contributor: Sathish Reddy ( Malkajigiri ) Script: Razaq Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టురట్టయ్యింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్‌బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 80కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్‌కారు, 4200నగదు, 4చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నేరేడ్‌మెట్‌లోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ గంజాయి స్మగ్లర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 15లక్షల 20వేల రూపాయలు ఉంటుందని సీపీ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఉండే నలుగురు స్నేహితులు కలిసి విశాఖ పట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు. తమకు అందిన విశ్వాసనీయమైన సమాచారంతో కాపుకాసి నిందితులను పట్టుకున్నామని సీపీ వివరించారు. బైట్: మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.