ETV Bharat / city

కర్నూలులో హైకోర్టుకు చట్టం ఎలా చేస్తారు? : ఏపీ హైకోర్టు

author img

By

Published : Dec 9, 2020, 7:48 AM IST

ap high court
ap high court

ఏపీ రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ... తుది విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర శాసన వ్యవస్థకు చెందినదని వివరించారు. రాజధాని విషయంలో పార్లమెంట్​కు సంబంధం లేదని... ఏపీ విభజన చట్టంలో సైతం నిర్ణయాధికారం రాష్ట్రానికే ఇచ్చిందన ఆయన వాదించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మాత్రమే ప్రారంభించిందని, అది ప్రతిపాదనే అన్నారు. చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది.

ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చాక.. జ్యుడీషియల్‌ క్యాపిటిల్‌ పేరుతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పాలన వికేంద్రీకరణ చట్టం ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వివరణ ఇస్తూ... కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మాత్రమే ప్రారంభించిందని, అది ప్రతిపాదనే అన్నారు. చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. దవే బదులిస్తూ.. ప్రధాన బెంచ్‌ ఏర్పాటు అంశానికి అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిటీల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం అన్నది. రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రజల ప్రయోజనార్థమే
విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర శాసన వ్యవస్థకు చెందినదన్నారు. రాజధాని విషయంలో పార్లమెంట్‌కు సంబంధం లేదన్నారు. ఏపీ విభజన చట్టమూ నిర్ణయాధికారం రాష్ట్రానికే ఇచ్చిందన్నారు. మూడు రాజధానులకు సంబంధించి చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని పిటిషనర్లు చెప్పడం సరికాదన్నారు. ‘రాజధానుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. పిటిషనర్లు సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించలేదు. రాజధానిని మారిస్తే వారి భూములకు అధిక ధరలు దక్కవని ఆందోళన చెందుతున్న వారే కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రజాధనం వృథా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసింది’ అని దవే తెలిపారు.

సభా నిబంధనల్నిఉల్లంఘించడమే కదా

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని శాసనమండలిలో మొదటిసారి ప్రవేశపెట్టి మూడు నెలలు గడిచాకే వాటిని శాసనసభలో ఆమోదించారని దవే పేర్కొన్నారు. మండలి ఛైర్మన్‌ బిల్లుల్ని సెలక్టు కమిటీకి సిఫారసు చేశాక వాటిని శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం సభ వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమేకదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దవే స్పందిస్తూ.. శాసనసభను చట్టాలు చేయకుండా శాసనమండలి నిలువరించలేదన్నారు. శాసనసభ ఎన్నికైన బాడీ అని.. మండలి పెద్దల సభ మాత్రమేనన్నారు. సెలక్టు కమిటీ ఏర్పాటు చేయకుండా శాసనసభ/మండలి కార్యదర్శి జాప్యం చేశారంటూ పిటిషనర్లు వాదనలు వినిపించారని ఆ విషయంపై ఏం సమాధానం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తన సిఫారసులను అమలు చేయకపోతే గవర్నర్‌ను కానీ హైకోర్టును కానీ మండలి ఛైర్మన్‌ ఆశ్రయించవచ్చునన్నారు. బిల్లులు చట్ట రూపం దాల్చకుండా జాప్యం చేయడానికి ఛైర్మన్‌ యత్నించారని చెప్పారు. సభా వ్యవహారాల్లో కోర్టుల విచారణను అధికరణ 212 నిలువరిస్తుందని తెలిపారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కులకు భంగం కలగదన్నారు. అభివృద్ధి చేసిన ఫ్లాట్లు పొందేలా సీఆర్‌డీఏ రద్దు చట్టంలో రక్షణ కల్పించారన్నారు. పిటిషనర్లకు వ్యాజ్యాలు దాఖలు చేసే అర్హత లేదన్నారు.

ఇదీ చదవండి : పట్టభద్రుల స్థానాలపై భాజపా దృష్టి.. జోరు కొనసాగించేలా వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.