ETV Bharat / city

LIVE : హైదరాబాద్​లో మళ్లీ మొదలైన వర్షం

author img

By

Published : Oct 14, 2020, 6:29 AM IST

Updated : Oct 14, 2020, 10:47 PM IST

hyd rains
hyd rains

22:45 October 14

  • హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌
  • ఇనాంగూడ నుంచి తూప్రాన్‌పేట వరకు నెమ్మదిగా కదులుతున్న వాహనాలు 
  • ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న రాచకొండ పోలీసులు
  • ఇన్ఫోసిస్‌ సంస్థతో మాట్లాడి ఆహారం సమకూర్చిన రాచకొండ సీపీ

22:21 October 14

  • సికింద్రాబాద్‌ అల్వాల్‌లో వరద నీటిలో పడి వృద్ధురాలు మృతి

22:20 October 14

మళ్లీ మొదలైంది..

  • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
  • లంగర్‌హౌస్, గోల్కొండ, నాలానగర్, టోలిచౌకి, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్‌ మొదలైన వాన
  • మెహిదీపట్నం, హఫీజ్‌పేట్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లిలో కురుస్తున్న వర్షం
  • కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లో వర్షం

21:57 October 14

  • తుర్కయంజాల్‌ చెరువులో ఇద్దరు యువకులు గల్లంతైనట్లు ఫిర్యాదు
  • పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
  • ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు

21:57 October 14

  • జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • హిమాయత్‌సాగర్‌ 4 గేట్లు ఎత్తివేత
  • హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 4,640 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్‌ ఔట్‌ఫ్లో 6,860 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1763.20 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 9,999 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1781.60 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్‌ పూర్తి నీటిమట్టం 1790 అడుగులు

21:56 October 14

జంట నగరాల్లో మొబైల్ రైతు బజార్లు

  • జంటనగరాల్లో అందుబాటులోకి మొబైల్‌ రైతుబజార్లు
  • ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు
  • 56 వాహనాలతో 102 ప్రాంతాల్లో అందుబాటులోకి కూరగాయలు
  • వర్షం కారణంగా ప్రజల ఇబ్బందులను గుర్తించిన మార్కెటింగ్‌ శాఖ
  • వీలున్న ప్రతి చోటా మొబైల్‌ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం

21:08 October 14

జీహెచ్​ఎంసీకి భారీగా ఫిర్యాదులు

  • జీహెచ్ఎంసీ సహాయ కేంద్రానికి అందుతున్న ఫిర్యాదులు
  • జీహెచ్ఎంసీ కాల్ సెంటర్, వెబ్‌సైట్, డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్‌ ద్వారా భారీగా ఫిర్యాదులు
  • ఇప్పటివరకు 1,401 ఫిర్యాదులు చేసిన ప్రజలు
  • నీరు నిలవడంపై 643, డ్రైనేజీ పొంగిపొర్లడంపై 364 ఫిర్యాదులు

20:36 October 14

  • హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా స్తంభించిన వాహనాలు

19:58 October 14

  • నగరంలో విద్యుత్‌ సరఫరాపై ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష
  • గ్రేటర్​ హైదరాబాద్​లో విద్యుత్ సరఫరా, నష్ఠాలపై ఆరా
  • చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు హాజరు
  • భారీ వర్షం, గాలులకు 686 ఫీడర్లు దెబ్బతినగా... 671 ఫీడర్లలో పునరుద్ధరించినట్టు వెల్లడి
  • 15 పెండింగ్ ఫీడర్లు మరి కొద్దీ సమయంలో పునరుద్ధరించనున్నట్టు స్పష్టం
  • 15- 33/11 కేవీ సబ్​స్టేషన్లలో చేరిన వరద నీటిని బయటకి పంపి సరఫరా పునరుద్ధరణ

19:25 October 14

గాంధీనగర్​లో కిషన్ రెడ్డి పర్యటన

  • గాంధీనగర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
  • కిషన్ రెడ్డి వెంట పర్యటించిన భాజపా నేతలు కె.లక్ష్మణ్, రామచందర్‌ రావు
  • అరుంధతినగర్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న కిషన్‌రెడ్డి
  • వరదనీరు ఇళ్లల్లోకి వచ్చిందని కేంద్రమంత్రికి మొరపెట్టుకున్న మహిళలు

19:09 October 14

ఇళ్లు కూలిన బాధితులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి: బండి

  • వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ డిమాండ్
  • భాజపా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచన
  • భారీ వర్షాలపై హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శ
  • ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
  • నగరంలో వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి‌
  • ఇల్లు కూలిపోయిన బాధితులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి

19:08 October 14

  • సికింద్రాబాద్‌లో పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • బోయిన్‌పల్లి, తిరుమలగిరి, లాల్‌బజార్, కార్ఖానా రసూల్‌పురా, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్
  • నిన్నటి నుంచి అంధకారంలోనే పలు కాలనీలు, బస్తీలు
  • రెండ్రోజులుగా విద్యుత్ లేకవపోవడంతో అవస్థలు పడుతున్న ప్రజలు

18:19 October 14

  • హైదరాబాద్ శాలిబండలో కూలిన ఇల్లు
  • నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కూలుతుండగా... పరిగెత్తిన మహిళ
  • సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు

17:52 October 14

  • హిమాయత్‌సాగర్‌కు స్వల్పంగా తగ్గిన వరద
  • 7 గేట్లు మూసివేసి, ఆరు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

17:35 October 14

అల్​జుబుల్​ కాలనీలో ఇద్దరు.. గాజమిల్లత్​లో ఒకరు మృతి

  • చాంద్రాయణగుట్ట అల్​జుబుల్ కాలనీలో వరద వల్ల ఇద్దరు మృతి
  • ఇంట్లోనే వరద నీటిలో చిక్కుకుని మహిళ మృతి
  • వరదలో మరో వ్యక్తి మృతదేహం లభ్యం
  • పాతబస్తీ గాజమిల్లత్ కాలనీలో గోడ కూలి ఒకరు మృతి

17:25 October 14

  • భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటించిన హైకోర్టు

17:15 October 14

మెట్రోకు ప్రమాదం లేదు: ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి

  • వరదల వల్ల మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం జరగలేదని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
  • కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు నుంచి రోడ్లపైకి భారీ వరద
  • వరదలతో కొట్టుకుపోయిన మెట్రో పిల్లర్ల చుట్టు ఉన్న మట్టి
  • మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షణ
  • మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు, వదంతులు నమ్మవద్దని సూచన

17:07 October 14

అల్ జుబుల్​లో ఇద్దరు.. గాజమిల్లత్​ కాలనీలో ఒకరు మృతి

  • అల్ జుబుల్ కాలనీలో వరద వల్ల ఇద్దరు మృతి
  • గాజమిల్లత్ కాలనీలో గోడ కూలి ఒకరు మృతి

17:07 October 14

కూలిన పురాతన ఇల్లు

  • మొఘల్‌పురా పరిధి హరిబౌలిలో కూలిన పురాతన ఇల్లు
  • ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన ప్రాణనష్టం

16:50 October 14

  • సికింద్రాబాద్ హస్మత్​పేట్ అంజయ్యనగర్​లో బోయిన్ చెరువులో కొట్టుకుపోయిన వ్యక్తి
  • అప్రమత్తమై కాపాడిన స్థానికులు

16:49 October 14

  • హైదరాబాద్‌లో సాధారణం కంటే 404 శాతం అధిక వర్షపాతం నమోదు

16:41 October 14

  • చాంద్రాయణగుట్ట అల్‌జుబుల్ కాలనీలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
  • ముంపు ప్రాంతాల పరిశీలన

16:39 October 14

  • పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌, కలెక్టర్ పర్యటన
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం

16:32 October 14

  • బడంగ్‌పేటలోని ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ సహాయక చర్యలు
  • 76 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది

16:25 October 14

  • దిల్​సుఖ్​​నగర్​ సాహితీ అపార్ట్​మెంట్ సెల్లార్ నీటిలో మునిగి మూడేళ్ల బాలుడు మృతి
  • నిన్న కురిసిన భారీ వర్షానికి సెల్లర్​లోకి భారీగా చేరిన నీరు
  • ఆడుకుంటు వెళ్లి నీటిలో పడ్డ బాలుడు అజిత్ సాయి
  • తండ్రి యుగేందర్ గమనించి కిందికి వెళ్లేసరికి మునిగిన బాలుడు
  • ఆసుపత్రికి తరలించేసరికి చనిపోయాడని వైద్యుల వెల్లడి
  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సరూర్​నగర్ పోలీసులు

15:42 October 14

  • అసదుద్దీన్ ఓవైసీ, మలక్​పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి ఛాదర్​ఘట్​ వద్ద నాలాను పరిశీలించిన కేటీఆర్​
  • పాతబస్తీ, మలక్​పేటలో వర్షాభావ ప్రాంతాల గురించి ఆరా
  • బాధితులకు సెంబర్ హోంలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
     

15:34 October 14

కేటీఆర్​ ఆగ్రహం

  • రామంతాపూర్​లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
  • పెద్ద చెరువు నీటి పంపింగ్ ఏర్పాట్లపై అసంతృప్తి
  • జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం
  • చెరువు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

15:31 October 14

  • హైదరాబాద్: మూసారాంబాగ్ పరిధి సలీంనగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన
  • ముంపు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్
  • మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
  • లోతట్టు ప్రాంతవాసులు జీఎచ్ఎంసీ సహాయ కేంద్రాల్లో ఉండాలని కోరిన మంత్రి
  • పునరావాస కేంద్రాల్లో ఆహారం, మందులు, వైద్య వసతి ఉంటుందన్న మంత్రి

15:27 October 14

  • హైదరాబాద్: మూసాపేట మెట్రోస్టేషన్ కింద కుంగిన ప్రధాన రహదారి
  • మెట్రో పిల్లర్ల చుట్టూ కుంగిన భూమి, గుంతల్లోకి చేరిన వరద నీరు
  • వరద నీటిని మోటార్ల ద్వారా తోడిపోస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

15:26 October 14

  • హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం
  • హుస్సేన్‌సాగర్‌ నిండిపోయి పొంగిపొర్లుతున్న వరద
  • భారీ వరద వల్ల ట్యాంక్‌బండ్ దిగువన ఉన్న ప్రజల్లో భయాందోళన
  • హుస్సేన్‌సాగర్‌ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు
  • హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతవాసులను అప్రమత్తం చేసిన అధికారులు

15:18 October 14

అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ పర్యటన

  • హైదరాబాద్‌: అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ పర్యటన
  • రామంతాపూర్ చెరువు, హబ్సిగూడ ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
  • బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్పొరేటర్లను సూచించిన ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

15:16 October 14

జంట జలాశయాల్లోకి భారీగా వరద

  • హైదరాబాద్‌: జంట జలాశయాల్లోకి భారీగా వరద
  • హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 19,100 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ 11 గేట్లు ఎత్తి 22 వేల క్యూసెక్కులు మూసీలోకి విడుదల
  • హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1762. 86 అడుగుల నీటిమట్టం ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం 
  • హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 20,833 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1779. 50 అడుగుల నీటిమట్టం

14:57 October 14

నీట మునిగిన పురాతన శివాలయం

  • హైదరాబాద్‌: చైతన్యపురిలో నీట మునిగిన పురాతన శివాలయం
  • చైతన్యపురిలో నీటమునిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
  • రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన ఆలయాలు

14:56 October 14

రహదారిపై భారీగా చేరిన వరద నీరు

  • హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరు
  • భారీగా వరద నీరు చేరికతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • వరద నీరు వల్ల కరీంనగర్ నుంచి పేషెంట్‌ను తీసుకొస్తున్న అంబులెన్స్‌ నిలిపివేత
  • అంబులెన్సు అక్కడే నిలిపి స్ట్రెచర్‌పై పేషంట్‌ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలింపు

14:41 October 14

వరద ప్రవాహం

  • సికింద్రాబాద్: బోయిన్‌పల్లి పరిధిలో వరద ప్రవాహం
  • సీతారాంపురం, సౌజన్యకాలనీల్లోకి చేరిన వరద ప్రవాహం
  • వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పలు వాహనాలు

14:37 October 14

మంత్రి కేటీఆర్ పర్యటన

  • ఎల్‌బీనగర్‌ బైరామల్‌గూడలో మంత్రి కేటీఆర్ పర్యటన
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌
  • హోంమంత్రి, సీఎస్‌, డీజీపీతో కలిసి బైరామల్‌గూడలో పర్యటన
  • వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్న కేటీఆర్
  • నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
  • ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు సూచనలు చేసిన కేటీఆర్‌
  • బైరామల్‌గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన కేటీఆర్
  • తమ సమస్యలను మంత్రి కేటీఆర్‌కు వివరిస్తున్న ప్రజలు
  • శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కేటీఆర్‌ను కోరిన స్థానికులు
  • ముంపునకు గురైన ఓ నివాసంలోకి వెళ్లి బాధితులను పరిశీలించిన కేటీఆర్‌

13:55 October 14

  • నిజాంపేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కూలిన గోడ
  • 30 అడుగుల గోడ కూలి పక్కన ఉన్న భవనాలపై పడిన పెచ్చులు
  • పక్కన ఉన్న భవనంలో 2 ప్లాట్లు, రెండు కార్లు ద్విచక్రవాహనాలు ధ్వంసం

13:16 October 14

పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు

  • నీరు తగ్గే వరకు ఈ మార్గంలో వాహనరాకపోకలు నిషేధం : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ అనిల్‌కుమార్‌
  • కర్నూల్ నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు ఓఆర్‌ఆర్‌ను ఎంచుకోవాలి
  • పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని ఉపయోగించరాదు
  • మెహదీపట్నం నుంచి గచిబౌలి వెళ్లే వాహనదారులు సెవెన్‌ టోంబ్స్‌ దారిని ఎంచుకోవాలి
  • గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, షేక్‌పేట్, సెనార్ వ్యాలీ మార్గంలో వెళ్లాలి
  • గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు బంజారా హిల్స్‌ రోడ్ నంబర్ 12 ద్వారా వెళ్లాలి
  • పురాణాపూల్ వద్ద 100 అడుగుల రహదారి పూర్తిగా మూసివేయబడింది
  • పురాణాపూల్‌ దారికి ప్రత్యామ్నాయంగా కార్వాన్ వైపు దారి మళ్లింపు
  • చాధర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలు నింబోలిఅడ్డా, గోల్నాక మీదుగా ఉప్పల్ వైపు దారి మళ్లింపు
  • అలీ కేఫ్-అంబర్‌పేట్ మార్గంలో మూసారంబాగ్ ఆర్‌టీఏ ఆఫీస్ వంతెన మూసివేత
  • ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి
  • మలక్‌పేట్ - ఎల్బీనగర్‌ రహదారి పూర్తిగా నిషేధించడమైంది
  • వర్షాల కారణంగా ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పూర్తిగా మూసివేత
  • ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి
     

13:14 October 14

  • వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పలు చోట్ల పొంగిపొర్లుతున్న నాలాలు
  • నీరు ప్రవహిస్తున్న మార్గాలను మూసివేసి ఆంక్షలు విధించిన ట్రాఫిక్‌ పోలీసులు
  • సూచనలకు అనుగుణంగా వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసుల విజ్ఞప్తి
  • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసుల సూచన
  • తక్షణ సహాయం కోసం పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరు: 9010203626 ఏర్పాటు
  • తక్షణ సహాయం కోసం ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ నంబరు: 040-27852482 ఏర్పాటు
  • ఎడతెరపిలేని వర్షాలకు పొంగిపొర్లుతున్న మూసీ నది, పలు ప్రాంతాల్లో నాలాలు
  • ఆరాంఘర్‌ వద్ద హైదరాబాద్-కర్నూల్ జాతీయరహదారిపైకి చేరిన వరద నీరు

12:22 October 14

  • హరిహరపురంకాలనీలో జేసీబీల సాయంతో మంచి నీటి క్యాన్‌లను అందిస్తున్న అధికారులు

12:22 October 14

  • ముషీరాబాద్‌ పరిధి అరవింద్‌నగర్‌, అరుంధతినగర్‌, ఓంనగర్‌లో కలెక్టర్‌ శ్వేతామహంతి పర్యటన
  • హుస్సేన్‌సాగర్‌ నాలా పరివాహక ప్రాంతాలను పరిశీలించిన శ్వేతామహంతి

12:22 October 14

  • భారీ వరద కారణంగా నీట మునిగిన రైల్‌ అండర్‌ బ్రిడ్జి
  • బల్కంపేట-బేగంపేట మధ్య లింక్‌రోడ్డులో నీట మునిగిన వంతెన
  • నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయిన రాకపోకలు
  • బల్కంపేటలో ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాల్లోకి చేరిన వరద నీరు
  • మోటార్ల సాయంతో ఆలయంలోని నీటిని తొలగిస్తున్న అధికారులు

11:34 October 14

  • హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌లోని గోల్డెన్‌ కేవ్‌ రెస్టారెంట్‌ క్యాషియర్‌ మృతి 
  • వరద ముంచెత్తడంతో విద్యుదాఘాతానికి గురై క్యాషియర్ మృతి

11:32 October 14

  • అంబర్‌పేట్‌ నుంచి యూనివర్సిటీకి వెళ్లే దారిలో కూలిన భారీ వృక్షం
  • శివo రోడ్డులో కూలిన భారీ వృక్షం, రాకపోకలకు అంతరాయం
  • బార్కాస్‌ ప్రాంతంలో వరద ఉద్ధృతి
  • వరద ప్రవాహంలో కొట్టుకోపోయిన వ్యక్తి

11:10 October 14

  • మియాపూర్ ప్రకాష్‌నగర్‌లో పొంగిపొర్లుతున్న చెరువు
  • చెరువు ప్రవాహ ఉద్ధృతికి కూలిన అమ్మవారి గుడి
  • పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాకపోకలు నిషేధం
  • తదుపరి ఉత్తర్వులు అందే వరకు రాకపోకలు నిషేధం అమలు
  • హైదరాబాద్‌: ఓల్డ్‌ బోయినపల్లి వికాస్‌నగర్‌ రాయల్‌ ఎన్‌క్లేవ్‌ను చుట్టుముట్టిన వరద నీరు
  • నిత్యవసరాలు లేక వృద్ధులు, చిన్నారులు, రాయల్‌ ఎన్‌క్లేవ్‌ వాసుల ఇబ్బందులు

11:09 October 14

  • వర్షాల కారణంగా ఇవాళ, రేపు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవు 

10:44 October 14

జలదిగ్బంధం 

  • చాంద్రాయణగుట్ట అల్‌ జుబేల్‌ కాలనీ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధం
  • భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్న స్థానికులు
  • చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బండ్లగూడ వెళ్లే దారిలో నిలిచిన రాకపోకలు
  • ఫలక్‌నుమా రైల్వే వంతెన వైపు రాకపోకలు నిషేధం
  • వరద నీటిలో అల్‌జుబేల్‌కాలనీ వరకు కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం

10:39 October 14

  • వర్షాలతో తాతాచారికాలనీ వైపు కూలిన బేగంపేట విమానాశ్రయం ప్రహరీ గోడ

10:38 October 14

హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

  • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ
  • హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహణ
  • మంత్రి తలసాని శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసీయుద్దీన్ హాజరు
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, పురపాలక శాఖ విభాగాల అధిపతులు హాజరు
  • జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని కేటీఆర్‌ ఆదేశం
  • జీహెచ్‌ఎంసీ మేయర్‌, ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి: కేటీఆర్‌
  • వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు వైద్య సదుపాయం కల్పించాలి: కేటీఆర్‌
  • ఇలాంటి క్యాంపుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి: మంత్రి కేటీఆర్‌

10:37 October 14

  • ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: గవర్నర్‌
  • ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రజలకు సహాయపడాలి: గవర్నర్‌ తమిళిసై

10:02 October 14

  • నెహ్రూ జూలాజికల్ పార్క్ మూసివేత
  • నెహ్రూ జూలాజికల్ పార్కులో సఫారీ పార్క్ సహా మరికొన్ని స్థలాల్లో చేరిన వరద నీరు
  • వరద నీరు చేరిక కారణంగా జూపార్కు మూసివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు

09:59 October 14

శిల్పారామం మూసివేత
 

  • మాదాపూర్‌ శిల్పారామంలో నేలకూలిన భారీ వృక్షాలు
  • ఇవాళ శిల్పారామం మూసివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు
  • ఉప్పల్‌ శిల్పారామంలోనూ వరద నీరు
  • వరద నీటితో కూలిన చెట్లు, ఇవాళ సెలవు ప్రకటన

09:43 October 14

  • హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
  • ఆన్‌లైన్‌ తరగతులకు సెలవులు ప్రకటించిన విద్యాసంస్థలు
  • వరదనీటి ఉద్ధృతికి హైదరాబాద్‌తో కలిసే హైవేలు పలుచోట్ల ధ్వంసం
  • నిన్న కురిసిన వర్షానికి పలుచోట్ల ఇంకా రోడ్డుపైనే వాననీరు

09:31 October 14

  • కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీ పరికి చెరువు నాలా వరద ఉద్ధృతి
  • పరికి చెరువు నాలా నుంచి ధరణీనగర్ రోడ్లపైకి చేరిన జీడిమెట్ల పారిశ్రామిక వ్యర్ధాలు
  • రోడ్లపై నురగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు
  • పొంగిపొర్లుతున్న బేగంపేట నాలా, పరిసరాలు జలమయం

09:12 October 14

  • హైదరాబాద్‌కు పశ్చిమ దిశగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం
  • రాగల 12గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనున్న వాయుగుండం: వాతావరణశాఖ
  • ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ

09:12 October 14

మెట్రో రైళ్లలో పెరిగిన రద్దీ

  • వాహనాల్లో వెళ్లే అవకాశం లేనందున మెట్రోను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు

09:11 October 14

నిలిచిన వందల వాహనాలు 

  • ఇనామ్‌గూడ వద్ద బాట చెరువు ప్రవాహ ఉద్ధృతి
  • జాతీయరహదారిపైకి చేరిన వరద నీరు, నిలిచన రాకపోకలు
  • హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో నిలిచిన వందల వాహనాలు
  • ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టిన పోలీసులు

09:09 October 14

వైద్యసేవలు అందక రోగుల అవస్థలు

  • తార్నాక డివిజన్ లాలాపేటలో నాలా ప్రవాహ ఉద్ధృతి
  • నాలా ప్రవాహానికి కూలిన ఐదు ఇళ్ల గోడలు
  • నీట మునిగిన నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి
  • వైద్యసేవలు అందక రోగుల అవస్థలు
  • కూకట్‌పల్లి జాతీయరహదారిపై బస్సు డిపో వద్ద నిలిచిన వాహనాలు
  • కంటోన్మెంట్‌లోని అసుల్‌పూర్‌, చోలాబాలన్‌రాయి ప్రాంతాలు జలమయం
  • మెహదీపట్నంలోని పలుకాలనీల్లో నేలకొరిగిన భారీ చెట్లు
  • జలదిగ్బంధంలో చర్లపల్లి డివిజన్ ఆఫీసర్‌కాలనీ
  • రంగారెడ్డి శంకర్‌పల్లి వద్ద గుడిసెల్లో చిక్కుకున్న ముగ్గురు

09:00 October 14

 మోకాలులోతు వరకు చేరిన నీరు

  • హయత్‌నగర్‌లోని బంజారా, ఆర్టీసీ కాలనీలు జలమయం
  • పలు కాలనీల్లో మోకాలులోతు వరకు చేరిన నీరు
  • సహాయచర్యలు చేపట్టిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు
  • జేసీబీతో తవ్వి నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు
  • వరద బాధితులను పునరావాస కేంద్రానికి తరలింపు

08:52 October 14

జలదిగ్బంధంలో 300 ఇళ్లు

  • హైదరాబాద్ వనస్థలిపురం హరిహరపురం కాలనీ జలమయం
  • జలదిగ్బంధంలో చిక్కుకున్న 300 ఇళ్లు
  • హరిహరపురంకాలనీలో నీటిలోనే కార్లు, ఇతర వాహనాలు
  • భారీగా వరదనీటి నిల్వతో సహాయచర్యలకు ఆటంకం
  • కాప్రాయి చెరువు గండి పడుతుందనే భయాందోళనలో 10 కాలనీల ప్రజలు
  • పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్న స్థానికులు
  • రంగారెడ్డి  ఫత్తేపూర్‌ వద్ద వంతెనపైకి మూసీ ప్రవాహం

08:41 October 14

  • కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలో కూలిన భారీ వృక్షం
  • వర్షానికి భారీ వృక్షం కూలి పడటంతో కారు ధ్వంసం
  • శంషాబాద్ విమానాశ్రయానికి నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

08:36 October 14

  • దండుమల్కాపురం నుంచి ఇనాంగూడ వరకు ట్రాఫిక్‌ జాం
  • 10 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
  • హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై నిలిచిన వందలాది వాహనాలు

08:13 October 14

జల దిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు

  • ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దయిన భాగ్యనగరం
  • ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో ఇంకా తగ్గని వరద ఉద్ధృతి
  • ఇంకా జల దిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు
  • ఖైరతాబాద్, చింతల్‌బస్తీలో భారీగా నిలిచిన వరద నీరు
  • గాంధీనగర్‌, మారుతీనగర్‌లో భారీగా నిలిచిన వరద నీరు
  • శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్‌లో భారీగా నిలిచిన వరద నీరు
  • ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నగరవాసులు

08:04 October 14

  • హిమాయత్ సాగర్ జలాశయం వద్ద 14 గేట్లు ఎత్తివేత
  • జలాశయంలోకి వస్తున్న 17200 క్యూసెక్కుల నీరు
  • 14 గేట్ల ద్వారా బయటకు వెళుతున్న 17150 క్యూసెక్కుల నీరు
  • మూసీకిలోకి వెళ్తున్న వరద నీరు

07:57 October 14

నగర ప్రజలు బయటకు రావద్దు: లోకేష్‌కుమార్‌

  • ఎడతెరపిలేని వర్షాల కురుస్తున్నందున నగర ప్రజలు బయటకు రావద్దు: లోకేష్‌కుమార్‌
  • వర్షాలతో నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయి: లోకేష్‌కుమార్‌
  • పలు లోతట్టు ప్రాంతాలు వరదముంపునకు గురయ్యాయి: లోకేష్‌కుమార్‌
  • జీహెచ్‌ఎంసీ అధికారులు, సహాయకబృందాలతో వరద సహాయక చర్యలు: లోకేష్‌కుమార్‌
  • మరో రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయి: లోకేష్‌కుమార్‌
  • ప్రజలు ఇళ్లలోనే ఉండాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌
  • శిథిలావస్థకు చేరిన భవనాలు, కొండవాలు ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలి: లోకేష్‌కుమార్‌
  • ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌
  • ఎటువంటి ఆసరా లేని వారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి: లోకేష్‌కుమార్‌

07:42 October 14

ఉద్ధృతంగా నాగారం సరిహద్దు నాలా

  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చర్లపల్లి నాగారం సరిహద్దు నాలా
  • పలు ఇళ్లలోకి చేరిన నాలా నీరు
  • బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహస్తుండడంతో నిలిచిన రాకపోకలు
  • రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

07:41 October 14

కాప్రాయ చెరువు కట్టకు పొంచి ఉన్న ముప్పు

  • కాప్రాయ చెరువు నిండి హరిహరపురకాలనీ నీటమునక
  • వరద నీరు చేరికతో నీట మునిగిన ఇళ్లు
  • బి.ఎన్‌.రెడ్డి గాంధీనగర్‌లో పి.వి.ఆర్ కాలనీ, గౌతమీనగర్‌లో ఇళ్లలోకి చేరిన నీరు
  • హయత్‌నగర్‌లోని శారదానగర్‌, సామనగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద
  • కాప్రాయ చెరువు కట్టకు పొంచి ఉన్న ముప్పు
  • చింతల్‌కుంట రేడియోస్టేషన్ గోడ కూలి జనప్రియహోమ్స్ ఇళ్లలోకి చేరిన నీరు
  • హైదరాబాద్‌ చైతన్యపురి-మలక్‌పేట రహదారిలో నిలిచిన వాహనాలు

07:41 October 14

నలుగురు గల్లంతు, ఇద్దరు మృతి

  • శంషాబాద్‌ గగన్‌పహడ్‌ వద్ద జాతీయరహదారిపైకి చేరిన నీరు
  • వరద ఉద్ధృతికి కోతకు గురైన జాతీయరహదారి
  • వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన నలుగురు గల్లంతు, ఇద్దరు మృతి
  • పక్కనే ఉన్న పల్లెచెరువు కట్ట తెగి జాతీయరహదారిపైకి చేరిన నీరు
  • నాగోల్ ఆదర్శనగర్‌కాలనీలో వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాలు

07:40 October 14

హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం

  • ప్రస్తుతం 1763.50 అడుగుల పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం
  • హిమయత్‌సాగర్‌లోకి వస్తున్న 17500 క్యూసెక్కుల నీరు
  • హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

07:40 October 14

  • చైతన్యపురి నుంచి ఎల్బీనగర్‌ వరకు చిన్న వాహనాలకు అనుమతి నిరాకరణ
  • రహదారులపై నీటి నిల్వతో చిన్న వాహనాల దారి మళ్లింపు

06:45 October 14

స్తంభించిన రాకపోకలు

  • హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కోఠి వెళ్లే మార్గంలో స్తంభించిన రాకపోకలు
  • చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని పలు బస్తీల్లోకి చేరిన వరద నీరు
  • చంపాపేట, రాజిరెడ్డినగర్‌, రెడ్డి కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు

06:40 October 14

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

  • వర్షాల వల్ల నగరంలో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
  • హైదరాబాద్‌లో పలు సబ్‌స్టేషన్లలోకి ప్రవేశించిన వరద నీరు
  • ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దని అధికారుల సూచన
  • విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన నంబర్లు 1912, 100
  • విద్యుత్‌శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు: 73820 72104, 73820 72106
  • విద్యుత్‌శాఖ కంట్రోల్ రూమ్ నంబర్‌: 73820 71574

06:38 October 14

హెల్ప్​లైన్​ నంబర్లు

  • జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారుల విజ్ఞప్తి
  • అత్యవసర సేవల కోసం సంప్రదించాల్సిన నంబర్‌ 040-2111 11111
  • జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణశాఖ నంబరు: 90001 13667
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది నంబరు: 63090 62583
  • జీహెచ్‌ఎంసీ విద్యుత్‌శాఖ నంబరు: 94408 13750
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ నం. 83330 68536, డీఆర్‌ఎఫ్‌ నం. 040 2955 5500
  • ఎంసీహెచ్‌ విపత్తు నిర్వహణశాఖ నంబర్‌: 97046 01866

06:38 October 14

  • నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్
  • హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం
  • పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన హిమాయత్‌సాగర్‌ జలాశయం
  • హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
  • మూసీ నదిలోకి 2,752 క్యూసెక్కులు వదిలిన అధికారులు
  • పదేళ్ల తర్వాత హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తిన అధికారులు
  • హిమాయత్‌సాగర్‌ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • మూసీ పరివాహక, లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

06:38 October 14

  • భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు
  • హుస్సేన్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం దాటిన వరద నీరు
  • హుస్సేన్‌సాగర్‌లో 513.70 మీటర్లకు చేరిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు

06:35 October 14

  • చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని పలు బస్తీల్లో చేరిన వరద నీరు
  • చంపాపేట, రాజిరెడ్డినగర్‌, రెడ్డి కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు

06:27 October 14

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షపాతం
  • హైదరాబాద్‌లో చాలాచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు
  • అత్యధికంగా ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 32.3 సెం.మీ వర్షపాతం
  • హయత్‌నగర్‌లో 29.8, హస్తినాపురంలో 28.4 సెం.మీ వర్షపాతం
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.6, ఇబ్రహీంపట్నంలో 25.7 సెం.మీ వర్షపాతం
  • సరూర్‌నగర్‌లో 27.35, ఉప్పల్‌లో 25.6 సెం.మీ వర్షపాతం నమోదు
  • ముషీరాబాద్‌లో 25.6 సెం.మీ, బండ్లగూడలో 23.9 సెం.మీ వర్షపాతం
  • మేడిపల్లిలో 24.2 సెం.మీ, బాలానగర్‌లో 23.1 సెం.మీ వర్షపాతం
  • సికింద్రాబాద్‌లో 23.2 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 22.6 సెం.మీ వర్షపాతం
     

06:26 October 14

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

  • నగరంలో వరద పరిస్థితులపై అధికారులతో మేయర్‌ రామ్మోహన్‌ సమీక్ష
  • వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం చేయాలి: మేయర్
  • మరో 2, 3 రోజులపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: మేయర్‌
  • నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: మేయర్‌

06:19 October 14

పది మందిని కాపాడిన పోలీసులు

  • వరద ప్రవాహం నుంచి పది మందిని కాపాడిన చైతన్యపురి పోలీసులు
  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కొనసాగుతున్న సహాయ చర్యలు
  • సహాయ చర్యల్లో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి: రాచకొండ పోలీసులు
  • ప్రజలు సురక్షితంగా ఉంటూ ఇతరులకు సహాయం చేయండి: రాచకొండ పోలీసులు
Last Updated :Oct 14, 2020, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.