ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు వర్షాలు

author img

By

Published : Oct 20, 2019, 5:24 PM IST

rain in hyderabad

రాగల ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాగల ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు వర్షాలు

ఇదీ చూడండి: హైదరాబాద్‌లో వర్షం.. ట్రాఫిక్​కు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.