'అవసరమైతే నూకలు తింటాం, కేంద్రాన్ని గద్దె దించుతాం'

author img

By

Published : Apr 1, 2022, 5:27 PM IST

Harishrao Comments on central minister piyush goyal about paddy procurement in telangana
Harishrao Comments on central minister piyush goyal about paddy procurement in telangana ()

Harishrao fire on piyush: యాసంగి ధాన్యం వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుండగా..కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. రాజ్యసభ సాక్షిగా మరోసారి కేంద్రమంత్రి పీయూష్​ గోయల్‌ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Harishrao fire on piyush: రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్​రావు తప్పుబట్టారు. యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దేశం మొత్తం ఒకేరకమైన పరిస్థితులు ఉండవని.. కేంద్రం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను అవమానపరిస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే నూకలు తినైనా.. కేంద్రాన్ని గద్దె దించుతామన్నారు.

"కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ రైతుల్ని అవమానపరిస్తే సహించేది లేదు. పంజాబ్‌ తరహా వాతావరణం తెలంగాణలో ఉండదు. పంజాబ్‌లో విత్తన ధాన్యాలు పండిచడం సాధ్యమా..? ఒక్కడ ఒక పంట గోధుమలు వేస్తారు. ఇక్కడ అలా వేయటానికి లేదు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. రా రైస్‌ ఇవ్వాలని మెలిక పెట్టడమేంటి? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని.. మోసం చేస్తున్నారు. డబ్ల్యూటీవో నిబంధనలపై కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. అవసరమైతే నూకలు తింటాం, కేంద్రాన్ని గద్దె దించుతాం." - హరీశ్‌రావు, మంత్రి

పీయూష్​ గోయల్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం..

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.