ETV Bharat / city

'పట్టుదలగా పని చేయండి'.. సివిల్స్ విజేతలకు గవర్నర్ సూచన

author img

By

Published : May 31, 2022, 10:06 AM IST

Appreciation to Civils Rankers: రాష్ట్రం నుంచి సివిల్స్ సాధించిన విజేతలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పేదల సమస్యలను పరిష్కరించి దేశానికి గర్వకారణంగా నిలవాలని గవర్నర్‌ అన్నారు. పట్టుదలగా పనిచేసి ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

Appreciation to Civils Rankers
Appreciation to Civils Rankers

  • Some amazing stories of grit & determination have come to the fore with the #CivilServicesResults2021

    My compliments to the three girls who’ve topped the list & to all the rankers who’ve been selected from Telangana👏

    May you lead India into the first world with your efforts 👍

    — KTR (@KTRTRS) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Appreciation to Civils Rankers: తెలంగాణ తరఫున సివిల్స్​లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేయాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. పేదల సమస్యలను పరిష్కరించి దేశానికి గర్వకారణంగా నిలవాలని గవర్నర్‌ కోరారు.

governor
ట్విట్టర్ వేదికగా సివిల్స్ విజేతలకు అభినందనలు తెలిపిన గవర్నర్

సివిల్స్‌లో తొలి మూడు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగం అవకాశమని కేటీఆర్​ అన్నారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. పట్టుదలగా పనిచేసి ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:Civils Results 2021: 'సివిల్స్ ర్యాంకర్స్‌ విజయ సూత్రాలివే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.