ETV Bharat / city

'ఇవాళ గట్టిగ గాలొస్తది.. చెట్ల కింద ఉండొద్దు'

author img

By

Published : Jul 12, 2022, 12:24 PM IST

GHMC Alert : భాగ్యనగరాన్ని గత నాలుగైదు రోజులుగా వరణుడు వణికిస్తున్నాడు. మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రానున్న 12 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

GHMC Alert
GHMC Alert

  • Due to very high wind velocity & given the height, the flag was likely to be damaged and thus been taken down temporarily to prevent any damage.
    Will be put up as soon as wind velocity comes down

    This is for information pic.twitter.com/46dPReC8WX

    — Arvind Kumar (@arvindkumar_ias) July 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

GHMC Alert : హైదరాబాద్‌లో రానున్న 12 గంటలపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. బలమైన గాలుల ప్రభావానికి చెట్లు విరిగిపడే అవకాశం ఉందని.. నగరవాసులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఎమర్జెన్సీ కోసం డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ హెచ్చరికల నేపథ్యంలో సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా డ్యామేజ్‌ కాకుండా ఉండేందుకు తాత్కాలికంగా కిందికి దించినట్లు హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.