ETV Bharat / city

'నీట మునిగిన ఇళ్లకు రూ.2లక్షలు పరిహారం ఇవ్వాలి'

author img

By

Published : Oct 26, 2020, 6:32 PM IST

Updated : Oct 26, 2020, 7:44 PM IST

20 రోజులుగా వరద నీటిలోనే ఉన్న ఉస్మాన్​నగర్ ప్రాంతాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు రూ.2లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులు తొలగించాలన్నారు.

konda vishweshwar reddy visits flood effect areas
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి పర్యటన

ఇటీవల కురిసిన వర్షాలకు రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్​ఖాన్ చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా చెరువుకు సమీపంలో ఉన్న ఉస్మాన్​నగర్​లోని ఇళ్లన్నీ ముంపునకు గురయ్యాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షాకిర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్​రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

వరద నీటిలో మగ్గిపోతున్న తమను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. వరద బాధితులకు ప్రభుత్వం అందించే రూ.10 వేల సాయం కూడా సక్రమంగా అందడం లేదన్నారు.

ఇళ్లు నీట మునిగి.. సర్వం కొల్పొయినా... వరద బాధితుల సమస్యలు ఇంకా పరిష్కరించకపోవడం గమనార్హమని కొండా విశ్వేశ్వర్​రెడ్డి అన్నారు. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు రూ.2లక్షలు పరిహారం ఇవ్వాలని విశ్వేశ్వర్​రెడ్డి​ డిమాండ్ చేశారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులు తొలగించాలన్నారు. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ.. ముంపు ప్రాంతాన్ని ఇప్పటివరకు సందర్శించడంలేదని మండిపడ్డారు.

ఇవీ చూడండి: పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ వెంకట్​ రెడ్డి

Last Updated : Oct 26, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.