ETV Bharat / city

దుర్గగుడి ఆలయ ఆదాయంపై కరోనా ప్రభావం..

author img

By

Published : Apr 6, 2021, 3:08 PM IST

ఏపీలోని విజయవాడ కనకదుర్గ ఆలయ ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. కొవిడ్​ కారణంగా గుడికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఆదాయం సరిగ్గా లేక సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు దేవస్థానం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది

durga temple income
durga temple income

ఏపీలోని విజయవాడ దుర్గగుడి ఆదాయంపై.. కరోనా ఊహించని ప్రభావం చూపింది. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.17 కోట్ల ఆదాయం వస్తుండగా అది కాస్త రూ.5.68 కోట్లకు పడిపోయింది. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 20 నుంచి అన్ని రకాల దర్శనాలు, ఆర్జితసేవలు నిలిచిపోయాయి. భక్తులతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఏడాది పూర్తయిన తరువాత నిత్య దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపి 2వేల నుంచి 25వేల వరకు పెరగడంతో మళ్లీ పూర్వవైభవం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

durga temple income
దుర్గగుడి ఆలయ ఆదాయంపై కరోనా ప్రభావం..

వెంటాడుతున్న ఇబ్బందులు

ఆదాయం పడిపోయిన కారణంగా సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు దేవస్థానం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భవానీ దీక్షలు, దసరా ఉత్సవాల సమయంలో కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రాకపోకలను నియంత్రించడం, ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంతో దేవస్థానం రూ.11.32 కోట్ల ఆదాయం నష్టపోయింది.
భారీగా ఇలా: 2019-20 ఆర్థిక సంవత్సరంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన విలువైన పట్టుచీరలు, సాధారణ చీరల ద్వారా దేవస్థానానికి రూ.4.97 కోట్లు ఆదాయం వచ్చింది. 2020-21లో భక్తుల రాక తగ్గిపోవడంతో కేవలం రూ.1.21కోట్లు మాత్రమే లభించింది.
* దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను ఘాట్‌రోడ్డు మార్గం, కనకదుర్గానగర్‌లో నిలుపుతారు. అందుకుగాను దేవస్థానం వారి నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తుంది. కొవిడ్‌కు ముందు రూ.1.72 కోట్లు ఆదాయం రాగా.. గతేడాది కేవలం రూ.72లక్షలు మాత్రమే వచ్చింది. షాపుల అద్దెల ద్వారా దేవస్థానానికి రూ.81.90లక్షలు ఆదాయం రాగా అది రూ.11.39లక్షలకు పడిపోయింది.

ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.