ETV Bharat / city

Dr. Uma: డాక్టర్ దాతృత్వం.. ఆస్తి అంతా జీజీహెచ్​కు..

author img

By

Published : Oct 6, 2022, 12:29 PM IST

20 Crore donation by Dr.Uma: ఆమె ఒక వైద్యురాలు.. తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు.. ఆమె భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోగా.. తనకు, తన భర్తకు చెందిన పూర్తి ఆస్తులను ఆసుపత్రికి డొనేట్​ చేసినట్లు వెల్లడించారు. ఆమెను స్పుర్తిగా తీసుకోని మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చారు. వారు సైతం గుంటూరు జీజీహెచ్​కు భారీగా విరాళాలు ఇచ్చారు.

Dr. Uma
Dr. Uma

20 Crore donation by Dr.Uma: తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు ఆ వైద్యురాలు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి తన దగ్గర ఒక్క రూపాయి సైతం మిగుల్చుకోలేదు. మొత్తంగా రూ.20 కోట్ల (2.50 మిలియన్ డాలర్లు)చేసే తన ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంక్షేమ భవనం కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు డాక్టర్ ఉమ. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆమె 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లారు. ఇమ్యునాలజిస్ట్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. తన చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. గతంలో ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు.

ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు తెలిపారు. ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి జింకానా సభ్యులు డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉమ భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థీషియన్​గా విధులు నిర్వహించే వారు. అయితే మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు.

ఆమె స్ఫూర్తితో మరికొంత మంది: జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా ఇచ్చిన విరాళాల స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం స్పందించారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు సైతం తన వంతుగా రూ.20 కోట్లు , డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌ రూ.8 కోట్లు తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మరి కొంతమంది పూర్వ విద్యార్థులు సైతం విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.