ETV Bharat / city

ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీని అభినందించిన సీఎం కేసీఆర్​

author img

By

Published : Aug 17, 2020, 10:41 PM IST

విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడడం, విద్యుత్​ సరఫరాలో హెచ్చుతగ్గులున్నా.. గిడ్​ కుప్పకూలకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినందుకు సీఎండీ ప్రభాకర్​రావు, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.

cm kcr prizes transco genco cmd prabhakar and electricity employees
ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీని అభినందించిన సీఎం కేసీఆర్​

విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడం సహా, గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని సీఎండీ ప్రభాకర్​రావు, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్​లో సోమవారం నిర్వహించిన సమీక్షలో విద్యుత్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.

కరీంనగర్ జిల్లాలో 220 కేవీ సామర్థ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయని సీఎంకు సీఎండీ ప్రభాకర్​ వివరించారు. వరంగల్ జిల్లాలో రెండుచోట్ల 33 కేవీ సబ్​స్టేషన్లు నీట మునిగాయన్నారు. ఎన్పీడీసీఎల్​ పరిధిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండడంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని సీఎంకు నివేదించారు.

వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్​పీడీసీఎల్​ పరిధిలో 159, ఎన్​పీడీసీఎల్ పరిధిలో 89.. డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్​ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు.

ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్, లోయర్​ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్​లలో మొత్తం 1200 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గినందున కేటీపీపీ, సింగరేణి, కేటీపీఎస్ తదితర ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించామని సీఎండీ ప్రభాకర్​రావు వివరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో నమోదు కాని విధంగా తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదయిందని కేసీఆర్​ అన్నారు. ఇదే ఏడాది ఒక సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్ఠానికి డిమాండ్ పడిపోయిందని... సాధారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తితే గ్రిడ్ కుప్పకూలుతుందని సీఎం అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆ పరిస్థితి తలెత్తకుండా చేశాయంటూ ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్​ అభినందించారు.

ఇవీచూడండి: ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.