ETV Bharat / city

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

author img

By

Published : Sep 28, 2022, 2:18 PM IST

Updated : Sep 28, 2022, 3:15 PM IST

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

14:16 September 28

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి గాను సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్​ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనుంది.

2020 సంవత్సరంలోనూ సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో 28% వాటాను రాష్ట్రం ప్రభుత్వం దసరా కానుకగా అందించింది. అలాగే గత సంవత్సరం కూడా 29% వాటాను విజయదశమి కానుకగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. లాభాల్లో 30% వాటాను ఉద్యోగులకు దసరాలోపు అందించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్​కు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా బోనస్​ ప్రకటించినందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీజీబీకేఎస్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.