ETV Bharat / city

CHANDRABABU: 'ఒక్క చంద్రయ్యను చంపితే.. వందమంది తయారవుతారు'

author img

By

Published : Jan 13, 2022, 10:43 PM IST

CHANDRABABU: ఏపీ తెలుగుదేశం నేత చంద్రయ్య హత్యకు ఏపీ సీఎం జగన్ జవాబు చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక్క చంద్రయ్యను చంపితే.. వందమంది తయారవుతారన్నారు. తెలుగుదేశం హయాంలో పల్నాడులో ముఠాలను అణిచివేశానన్న బాబు... రౌడీలు అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

CHANDRABABU: 'పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా'
CHANDRABABU: 'పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా'

CHANDRABABU: ఏపీలోని గుంటూరు జిల్లా గుండ్లపాడులో దారుణహత్యకు గురైన చంద్రయ్య మృతదేహానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. చంద్రయ్య పాడె మోసి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రయ్యను చంపిన వారికి శిక్షపడాలని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేయాలంటే భయపడేలా వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఒక్క చంద్రయ్యను చంపితే.. వందమంది తయారవుతారని తెదేపా అధినేత స్పష్టం చేశారు. చంద్రయ్య హత్యపై సీఎం జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రయ్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. మనందరి ప్రాణాలూ ఒకటేనని తెలుసుకోవాలి. రౌడీలందరూ జాగ్రత్తగా ఉండాలి. పల్నాడులోని ముఠాలను అణచివేశాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ.. నీలాంటి వారిని చాలామందిని చూశాను. మాచర్ల మీ జాగీరు కాదు, ఖబడ్దార్‌. మా నేతలపై దాడి చేసిన రౌడీకి మున్సిపల్ ఛైర్మన్‌ ఇస్తావా?.

- చంద్రబాబు, తెదేపా అధినేత

CHANDRABABU: 'పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా'

చంద్రయ్య హత్య.. ఏం జరిగిందంటే..?

tdp leader Murder: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెదేపా నేత హత్య కలకలం సృష్టించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున గ్రామ కూడలిలో కూర్చుని ఉన్న సమయంలో కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడ్నుంచి దుండగులు పారిపోయారు.

పాత కక్షలే కారణామా..?

గ్రామంలో పాత కక్షలే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మాచర్ల తెదేపా ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రయ్య ముఖ్య అనుచరుడు. ఇటీవల బ్రహ్మారెడ్డి వెంట తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కారణంగానే చంద్రయ్యను హత్య చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.