ETV Bharat / city

Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

author img

By

Published : Aug 21, 2021, 4:06 PM IST

Updated : Aug 21, 2021, 4:39 PM IST

Kishan ReddyKishan Reddy
కిషన్​ రెడ్డి

దేశానికి రాజైన అంబర్​పేటకు బిడ్డనేనని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. అంబర్​పేటకు చేరగానే రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కిషన్​ రెడ్డి అన్నారు.

అంబర్​పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్​పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని చెప్పారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. అంబర్ పేట ప్రజలు తన ప్రాణమని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. అంబర్​పేట గురించి ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. కేంద్ర మంత్రి అయినందుకు సంతోషం లేదని.. అంబర్​పేటకు దూరమయ్యానని బాధ ఉందన్నారు. అంబర్​పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్​పేట బిడ్డ కృషి కూడా ఉందన్నారు. గోల్కొండ కోటను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అంబర్​పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. పార్టీ, అంబర్​పేట తనకు రెండు కళ్లతో సమానమని కిషన్​ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పరిపాలన పక్కన పెట్టి ఫామ్ హౌస్, ప్రగతి భవన్​లో పడుకుంటున్నారని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... కేసీఆర్ నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భాజపాను ఆశీర్వదించాలని కోరారు.

'అంబర్​ పేట ప్రజలు నా ప్రాణం. ఈ రోజు నేను దిల్లీలో ఉన్నానంటే దానికి అంబర్​పేట, సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ప్రజలే కారణం. మీరు నాకు అందించిన ప్రేమ, అప్యాయత ఎన్నటికీ మరిచిపోలేను. చివరి శ్వాస వరకు అంబర్​పేట ప్రజలను మర్చిపోలేను. ప్రతి రోజు బస్తీల్లో తిరుగుతున్నప్పుడు చిన్నాపెద్ద, అక్కలు, చెల్లెల్లు, మాతృమూర్తులు స్వాగతం పలికే వారు.'

-కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే

ఇదీ చదవండి: Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!

Last Updated :Aug 21, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.