ETV Bharat / city

Hashish Oil: హైదరాబాద్​లో 'హాషీష్‌ ఆయిల్‌'... పోలీసులకు సవాల్!

author img

By

Published : Aug 6, 2021, 11:58 AM IST

హైదరాబాద్​లో హాషీష్‌ ఆయిల్‌ను భారీగా తయారు చేస్తున్నారు. హాషీష్‌ ఆయిల్‌ (గంజాయి నూనె)ను గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు. రకరకాల రసాయనాలు కలిపి మరిగిస్తారు. అప్పుడు నూనె మాదిరి ద్రావణం తయారవుతోంది.

Hashish Oil: భాగ్యనగరంలో మత్తెక్కిస్తోన్న 'హాషీష్‌ ఆయిల్‌'
Hashish Oil: భాగ్యనగరంలో మత్తెక్కిస్తోన్న 'హాషీష్‌ ఆయిల్‌'

భాగ్యనగరంలో ‘హాషీష్‌ ఆయిల్‌’ మత్తెక్కిస్తోంది. నిత్యం ఎక్కడో చోట పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. అయినా.. సరఫరాదారులు, వినియోగదారులు వెనక్కి తగ్గడం లేదు. రోజుకో తరహాలో నగరానికి చేరుస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు.

10 ఎంఎల్‌.. రూ.3వేలు... హాషీష్‌ ఆయిల్‌ (గంజాయి నూనె)ను గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు. రకరకాల రసాయనాలు కలిపి మరిగిస్తారు. అప్పుడు నూనె మాదిరి ద్రావణం తయారవుతోంది. విశాఖ ఏజెన్సీలో తయారయ్యే ఈ ఆయిల్‌ను నగరానికి తీసుకొచ్చాకా ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను కలుపుతున్నారు. 10 ఎంఎల్‌ డబ్బాల్లో నింపి.. ఒక్కోదాన్ని రూ.3వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఆయిల్‌ను ఒకటి లేదా రెండు చుక్కలు సిగరెట్‌లో వేసుకుని పీల్చితే మత్తు నషాళానికంటుతుంది.

కొరియర్‌.. ఫుడ్‌ డెలివరీ యాప్‌... విశాఖ ఏజెన్సీ నుంచి ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, గూడ్స్‌ వాహనాల్లో నగర శివారు ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. మూతపడిన పరిశ్రమలు, మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లను అద్దెకు తీసుకుని అడ్డాలుగా మార్చుకున్నారు. ఇక్కడే 10 ఎంఎల్‌ డబ్బాల్లోకి నింపుతారు. కొరియర్‌ మాదిరిగా చిన్న చిన్న అట్టెపెట్టెల్లో ప్యాకింగ్‌ చేస్తున్నారు.

ఏజెంట్లతో కలిసి తోటి విద్యార్థులకు... శివారుల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఈ హాషీష్‌ ఆయిల్‌కు అలవాటు పడ్డారని సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు పేర్కొంటున్నారు. కొంతకాలం వినియోగించిన తర్వాత దీనికున్న డిమాండ్‌, ఆదాయం గురించి తెలిసి వీళ్లే సరఫరాదారులుగా అవతారమెత్తుతున్నారు.

ఇదీ చూడండి:

Cannabis seize : పైన దానిమ్మ పండ్లు... లోపల భారీగా గంజాయి ప్యాకెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.