ETV Bharat / city

ప్రభుత్వ విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం: కోమటిరెడ్డి

author img

By

Published : Dec 19, 2020, 5:49 PM IST

తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో రెండో విడత కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు తీవ్రమైన‌ అన్యాయం జరగనుందని భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్‌కు లేఖ‌ అంద‌జేశారు.

bhuvanagiri mp komatireddy venkatreddy wrote letter to minister eetala rajendar
ప్రభుత్వ విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం: కోమటిరెడ్డి

కాళోజీ నారాయ‌ణ రావు హెల్త్ యూనివ‌ర్సిటీ అధికారులు‌ సీట్ల భ‌ర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిప‌డ్డారు. నిబంధ‌న‌ల ప్రకారం మొదట ఓపెన్ కేటగిరి సీట్లు భర్తీ చేసి తరువాత రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలి.

కానీ యూనివ‌ర్సిటీ యాజమాన్యం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ పద్ధతి దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవ‌లంభిస్తున్న విధానాలతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.