ETV Bharat / city

ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉంది: బండి సంజయ్‌

author img

By

Published : Mar 24, 2022, 7:41 PM IST

Bandi Sanjay
బండి సంజయ్‌

Bandi Sanjay About Paddy Procurement: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. తెరాస సర్కార్​కు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Bandi Sanjay About Paddy Procurement: రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే భాజపా చూస్తూ ఊరుకోదని... కర్షకులకు అండగా ఉద్యమిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తు‌న్నారని సంజయ్‌ ఆరోపించారు. లేని పంటను లెక్కల్లో చూపినట్లు సమాచారముందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్‌వి ఒట్టి అబద్ధాలే..

Bandi Sanjay Fires on CM KCR: ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలున్నాయని బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌వి ఒట్టి అబద్ధాలేనని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ ఆధారాలతో సహా తేల్చి చెప్పారని పేర్కొన్నారు. పంజాబ్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదని చెప్పారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనబోమన్నది అబద్ధమని... వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వరి కొనకపోతే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని సంజయ్ అన్నారు.

ఇదీ చదవండి:పీయూష్‌ గోయల్‌, ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.