ETV Bharat / city

'ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయండి.. రాజకీయాల కోసం కాదు'

author img

By

Published : Dec 14, 2019, 11:34 PM IST

అయేషా మీరా హత్యకేసులో ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు. వాటిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై అయేషా మీరా తండ్రి స్పందించారు.

ayesha-meera-body-re-post-mortem-after-11-years
ayesha-meera-body-re-post-mortem-after-11-years

అయేషా మీరా హత్యకేసులో సీబీఐ అధికారుల విచారణకు సంబంధించి రీ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైంది. పంచనామా వ్యవహారంలో తెనాలి తహసీల్దార్​ రవిబాబు పాల్గొన్నారు. సీబీఐ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీబీఐ తదుపరి విచారణ జరుగుతుందన్నారు.

సీబీఐ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు అయేషా మీరా తండ్రి తెలిపారు. అయేషా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోవడం ద్వారా సమాజానికి న్యాయం చేయాలన్నారు. ఏపీలో తీసుకొచ్చిన దిశ చట్టం ఒక బోగస్ చట్టమని... 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలని.. రాజకీయాల కోసం కాదని ఆయన సూచించారు.

'ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయండి.. రాజకీయాల కోసం కాదు'

ఇవీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9


Body:గుంటూరు జిల్లా తెనాలి బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఈద్గాలో రీ పోస్టుమార్టం పూర్తి చేసుకొని సిబిఐ అధికారులు వెళ్లారు అనంతరం oస్థానిక ఎమ్మార్వో రవికుమార్ ఆయేషా మీరా ఇక్బాల్





Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.