ETV Bharat / city

సీఎం కేసీఆర్​పై ఫిర్యాదు... కేసు నమోదు యోచనలో పోలీసులు!

author img

By

Published : Feb 15, 2022, 2:39 PM IST

Updated : Feb 15, 2022, 3:31 PM IST

kcr
kcr

14:38 February 15

సీఎం కేసీఆర్​పై ఫిర్యాదు... కేసు నమోదు యోచనలో పోలీసులు!

  • On the basis of complaints from various BJP supporters, Assam Police to file a case against Telangana CM for questioning the Army by demanding proof for surgical strike and thereby encouraging anti-India sentiments: Assam Police sources

    — ANI (@ANI) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Case on CM KCR: సర్జికల్స్ స్ట్రయిక్స్​పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం భాజపా కార్యకర్తలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్​​ మీట్​లో సర్జికల్‌ స్ట్రయిక్స్​కు​ ఫ్రూప్​ కావాలని కేసీఆర్​ డిమాండ్​ చేశారు. దేశ వ్యతిరేక భావాలు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్​పై పోలీసులకు భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్​ఐ వెల్లడించింది.

స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్

సర్జికల్‌ స్ట్రయిక్స్​ మీద సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. భారత సైన్యం ధైర్యసాహసాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదని అన్నారు. అలాంటి వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని... దేశం, సైన్యంపై మంచి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారని చెప్పారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్​పై కేసీఆర్ ఏమన్నారంటే?

ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్​... కేంద్ర ప్రభుత్వం, భాజపాపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం... ఆ కామెంట్స్​ సమంజసమేనా అని ​ నిలదీశారు. రాహుల్​పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనన్నారు. అసోం సీఎంను భాజపా ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. ఆయనపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్​ స్పష్టం చేశారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని తెలిపారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌.. పొలిటికల్‌ స్టంట్‌ అని దేశంలో సగం మంది నమ్ముతున్నారని.. దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలివ్వండి : సీఎం కేసీఆర్​

Last Updated :Feb 15, 2022, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.