ETV Bharat / city

PENSIONS: వృద్ధాప్య ఫించన్లకు నేటి నుంచే దరఖాస్తులు

author img

By

Published : Oct 11, 2021, 5:23 AM IST

వృద్ధాప్య ఫించన్ల(Aasara Pension in Telangana) కోసం నేటి నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. పింఛను వయసును 57కు తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Applications invited  for old age pensions
Applications invited for old age pensions

రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్యం పింఛన్ల(Aasara Pension in Telangana)దరఖాస్తులు నేటి నుంచే స్వీకరించనుంది. లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ సూచించింది. వృద్ధులకు చివరి మజిలీలో చేయూతగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను(Aasara Pension in Telangana) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం(Aasara Pension in Telangana)లో భాగంగా 60 ఏళ్ల వయస్సు గల వృద్ధులకు రూ.2,116 పింఛను అందించేంది.. ఇటీవలే ఈ వయస్సును 57కు తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు(Aasara Pension in Telangana) మంజూరు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది.

అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కోరారు. సీఎం శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు శనివారం ఆయన బీఆర్కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి, పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మీసేవా కమిషనర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Aasara Pension in Telangana : వృద్ధులకు గుడ్​న్యూస్.. ఆ వయసు దాటిన అందరికీ పింఛన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.