ETV Bharat / city

AP Excise Department Budget 2022 : ఏపీలో ఎక్సైజ్​ ద్వారా రూ.16, 500 కోట్ల అంచనా

author img

By

Published : Mar 12, 2022, 9:16 AM IST

AP Excise Department Budget 2022 : మద్యం నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దశల వారీ మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసిన ఏపీ సర్కారు.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఎక్సైజ్ ఆదాయాన్ని 16 వేల 500 కోట్లుగా బడ్జెట్‌లో అంచనా వేసింది.

AP Excise Department Budget 2022
AP Excise Department Budget 2022

AP Excise Department Budget 2022 : కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని అధికారంలోకి వచ్చాక 3 దశల్లో నిషేధిస్తామని, కేవలం ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం లభ్యమయ్యేలా చేస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ ఇచ్చింది. తాజాగ బడ్జెట్‌లో అందుకు విరుద్ధంగా.. దశలవారీ మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసింది.

Budget For AP Excise Department 2022 : రాబోయే ఆర్థిక సంవత్సరం 2022-23లో స్టేట్‌ ఎక్సైజ్‌ పద్దు కింద 16 వేల 500 కోట్ల మేర ఆదాయం ఉంటుందని బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22లో స్టేట్‌ ఎక్సైజ్‌ పద్దు కింద 14 వేల 500 కోట్లు రాబడి వస్తుందని.. సవరించిన అంచనాల్లో పేర్కొంది. దాంతో పోలిస్తే 2022-23లో ఎక్సైజ్‌ పద్దు ద్వారా అదనంగా 2 వేల 500 కోట్ల మేర రాబడి వస్తుందని అంచనా. ఆ మేరకు లక్ష్యానికి చేరుకోవాలంటే మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచాల్సిందేనని బడ్జెట్‌లో పరోక్షంగా ప్రభుత్వమే చెప్పింది. 2019-20లో 20 వేల 871 కోట్లు, 2020 -21లో 20వేల 189 కోట్లు విలువైన మద్యం అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 - 22లో ఇప్పటి వరకు 22 వేల కోట్లకు పైగానే విక్రయాలు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ ఎక్సైజ్‌ పద్దు కింద 14 వేల 500 కోట్ల మేర రాబడి ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొంది.

AP Budget Sessions 2022 : 2022-23లో స్టేట్‌ ఎక్సైజ్‌ పద్దు కింద 16 వేల 500 కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తున్న ప్రభుత్వం.. 25 వేల నుంచి 28 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిపితేనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడుతుందని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. మద్యం విక్రయాల విలువలో స్టేట్‌ ఎక్సైజ్‌ కాకుండా అదనంగా వ్యాట్, స్పెషల్‌ మార్జిన్, ఏపీఎస్‌బీసీఎల్‌ కమీషన్, ఆర్‌ఈటీ, ఏఆర్‌ఈటీ వంటివన్నీ కలిసి ఉంటాయి.అంటే లక్ష్యాల్ని విధించి మరీ మద్యం అమ్మాలి. దుకాణాల సంఖ్యను తగ్గించటమే మద్యనిషేధం అనే తరహాలో ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. మద్యాన్ని ఆదాయ మార్గంగానే పరిగణిస్తున్నారు.

AP Assembly Sessions 2022 : అందుకే దాని ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17లో మద్యంపై ప్రభుత్వానికి స్టేట్‌ ఎక్సైజ్‌ ద్వారా 4వేల 644 కోట్లు వచ్చింది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరంలో 16వేల 500 కోట్లు వస్తుందని అంచనా. అంటే ఆరేళ్లలో మద్యం విక్రయాల ద్వారా స్టేట్‌ ఎక్సైజ్‌ రూపేణా వచ్చిన ఆదాయం 255.263 శాతం పెరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.