ETV Bharat / city

Black Fungus : బ్లాక్ ఫంగస్​కు చెక్ పెట్టే మరో డ్రగ్ విడుదల

author img

By

Published : May 31, 2021, 9:12 PM IST

బ్లాక్ ఫంగస్ వ్యాధికి చెక్​ పట్టేందుకు మరో డ్రగ్​ మార్కెట్​లో అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగరానికి చెందిన సెలాన్ ల్యాబొరేటరీస్.. ఆంఫోటెరిసిన్ బీ అనే ఎమల్షన్ రూపంలో ఉండే డ్రగ్​ను విడుదల చేసింది.

black fungus, drug to black fungus
బ్లాక్ ఫంగస్​, బ్లాక్ ఫంగస్​కు డ్రగ్

కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్​కు చెక్ పెట్టేందుకు మరో డ్రగ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్​కు చెందిన సెలాన్ ల్యాబొరేటరీస్ ఆంఫోటెరిసిన్ బీ అనే ఎమల్షన్ రూపంలో ఉండే డ్రగ్​ను ఇవాళ మార్కెట్​లోకి విడుదల చేసింది.

లిపోసోమల్ ఆంఫోటెరిసిన్ బీ అనే మెడిసిన్​ను సెలాన్ కంపెనీ 2013 నుంచి ఉత్పత్తి చేస్తోంది. జర్మనీ నుంచి లిపోయిడ్స్ ముడి పదార్థాలు నిలిచిపోవటంతో.. ఎమల్షన్ రూపంలో ప్రత్యామ్నాయ మెడిసిన్​ను సెలాన్ కంపెనీ తమ ఆర్ అండ్ టీం కృషి ద్వారా మూడు వారాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వ్యాధికి మందుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎమల్షన్ అందుబాటులోకి రావడం రోగులకు ఊరట కలిగిస్తోందని సెలాన్ తెలిపింది. రోజుకు పదివేల వయల్స్ ఉత్పత్తి చేసి ఆస్పత్రులు, కొవిడ్ చికిత్స కేంద్రాలకు సరఫరా చేస్తామని.. తద్వారా నెలకు 6 వేల మంది బ్లాక్ ఫంగస్ రోగులకు ఊరట లభిస్తుందని సెలాన్ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.