ETV Bharat / city

APPSC: ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత

author img

By

Published : Jun 26, 2021, 2:08 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఏపీపీఎస్సీ(APPSC) పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.

no interviews further in APPSC recruitments
APPSC: ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత

ఏపీపీఎస్సీ(APPSC) పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగాల ఎంపికలో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేశారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచే ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి: రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ తగలబెట్టిన సైన్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.